దేనికైనా హద్దులుండాలి
బాపూ బొమ్మ స్నేహ మరో సారి వివాదంలో చిక్కుకుంది. ఇంతకు మునుపు ప్రేమ పెళ్లి వివాదంలో చిక్కుకున్న ఆమె ఆ వివాదాన్ని మరచిపోకముందే మరో వివాదంతో అందరి నోళ్లలో నానుతోంది. ఇంతకీ ఆ వివాదం ఏంటంటే రాఘవేంద్రన్ అనే అభిమాని తనని పెళ్లి చేసుకుంటానని మొబైల్ సందేశాలు ఇస్తూ కొన్నాల్లుగా స్నేహను వేధిస్తున్నాడు. దీంతో ఓపిక నశించిన స్నేహ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి అతన్ని కటకటాలపాలు చేసింది.
దీనిపై స్పందించిన స్నేహ "అభిమానానికీ ఓ హద్దుండాలి. ఎంత కథానాయికలమైనా మాకంటూ ఓ వ్యక్తిగత జీవితం ఉంటుంది, దాన్ని నష్టపరిచే విధంగా వుండకూడదు. అయినా నాకు అభిమానులంటే చాలా గౌరవం, కానీ ఇలా హద్దుమీరే వాళ్లంటేనే ఒళ్లు మంట" అని చెప్పుకొచ్చింది. ఈ వివాదం వల్ల తాను మానసికంగా చాలా బాధపడ్డానని చెప్పారు.
ఇదిలా వుంటే జైల్లోవున్న రాఘవేంద్రన్ మాత్రం స్నేహపై చాలా కోపంగా వున్నాడని సమాచారం. తాను ఏమీ లేని వాడిని కాదని, రియలెస్టేట్ బిజినెస్ చేస్తున్నాని..అలాంటి నన్ను చేసుకోవడానికి స్నేహకు ఇబ్బందేమిటనీ కనిపించినవారందరికీ చెబుతున్నాడట. తనని స్నేహ చాలా అవమానించిందని, అయినా స్నేహను క్షమించి పెళ్లి చేసుకుంటానని తన అమాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నాడట.


Click it and Unblock the Notifications











