అల్లు అర్జున్ వదిన పాత్రలో హీరోయిన్ స్నేహ!
హైదరాబాద్: ‘జులాయి' తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్నసంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈచిత్రాన్ని నిర్మించనున్నారు. సినిమాలోని ఓ ముఖ్యమైన పాత్రలో హీరోయిన్ స్నేహ ఖరారైన సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆమె ఇందులో అల్లు అర్జున్ వదిన పాత్రలో నటించబోతోందట. అదే విధంగా అల్లు అర్జున్ బ్రదర్ పాత్రలో తమిళ నటుడు అర్జున్ సార్జా నటిస్తున్నట్లు సమాచారం.
ఏప్రిల్ 10న ఈచిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయింది. ఈ నెల 22 నుండి లేదా అక్టోబర్ మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. సమంత, ఆదా శర్మ హీరోయిన్లుగా ఎంపికయ్యారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, తెలుగులో కూడా విడుదల చేయనున్నారు.

అల్లు అర్జున్ సినిమాలకు తమిళం, మలయాళంలో మంచి డిమాండ్ ఉండటంతో దర్శక నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నాట్లు తెలుస్తోంది. ఆ నేటివిటీకి తగిన విధంగా ఆయా బాషలకు చెందిన యాక్టర్లను కూడా సినిమాలో తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తమిళ నటుడు అర్జున్, స్నేహలను తీసుకోవడం వెనక కారణం అదే అని తెలుస్తోంది.
మరో వైపు....క్యారెక్టర్‌కు తగిన విధంగా 10 కేజీల బరువు తగ్గాలని దర్శకుడు త్రివిక్రమ్ ఆర్డర్ వేసారట. ఇటీవల రుద్రమదేవి షూటింగు కోసం కాస్త బరువు పెరిగిన అల్లు అర్జున్....త్రివిక్రమ్ సూచనల మేరకు బరువు తగ్గించుకునేందుకు జిమ్ లో వర్కౌట్లు చేస్తూ చమటోడుస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











