స్నేహా ఉల్లాల్ కి పిచ్చి పట్టిందా?
నేను చాలాలాలాలాలా పిచ్చిగా ఉంది..అని కాస్సేపటకి నేను పిచ్చి దాన్ని అంటూ స్నేహా ఉల్లాల్ తాజాగా ట్వీట్ చేసింది. చేతిలో సినిమాలు లేక ఆమెకు పిచ్చిపట్టి ఇలా ట్వీట్స్ చేస్తున్నారా అంటున్నారు. ఇది చదివిన వాళ్ళు. మడతకాజా చిత్రం తర్వాత ఆమె తెలుగులో ఆఫర్స్ వస్తాయని ఆశించింది. కానీ ఆమె ఆశలు భగ్నం చేస్తూ ఒక్క ఆఫర్ కూడా ఆమె చెంత చేరలేదు. అలాగని మిగతా భాషల్లో కూడా ఆమె బిజీగా లేదు. దాంతో ఆమె ఇలా ప్రస్టేషన్ కి లోనై ట్వీట్ చేస్తోంది అంటున్నారు.ఇక స్నేహా ఉల్లాల్ చాలా కాలం నుంచీ నడుం నొప్పితో బాధపడుతోండటంతో ఆమె కెరీర్ కి బాగా దెబ్బ తగిలింది.ఆ విషయమై ఆమె అప్పట్లో చెపుతూ.. సింహా సమయంలో నడుం నెప్పి మరింత ఎక్కువైంది. పాటల సమయంలో ఇంజక్షన్స్ తీసుకుని మరీ డాన్స్ చేసాను. డాక్టర్స్ విశ్రాంతి తీసుకోమన్నారు.
అందుకే సింహా తర్వాత మస్కట్ వెళ్ళిపోయాను అంటోంది స్నేహా ఉల్లాల్. ఆమెను సింహా హిట్టైనా అంత గ్యాప్ వచ్చిందని మీడియా వారు అడిగితే ఇలా సమాధానం ఇచ్చింది. అలాగే సింహా, అలా మొదలైంది లాంటి హిట్టులను నేను సినిమాలుగా మలుచుకోలేదని చాలా మంది అనుకుంటున్నారు. అందులో నిజం లేదు అంది. ఇక తాను ప్రస్తుతం అల్లరి నరేష్ సరసన మడతకాజా చిత్రంతో చేస్తున్నానని, ఆ సినిమా తర్వాత మరిన్ని సినిమాల్లో అవకాశాలు వస్తాయని నమ్మకం ఉందని అంది. అయితే ఆ సినిమా డిజాస్టర్ కావటం ఆమెకు ఇక్కడ ఆఫర్స్ లేకుండా చేసింది.


Click it and Unblock the Notifications











