బాలకృష్ణతో..దేవుడిచ్చిన గిఫ్ట్: స్నేహా ఉల్లాల్
బాలకృష్ణగారి లాంటి టాప్ స్టార్ పక్కన నటిస్తానని కలలోనైనా అనుకోలేదు. ఇది నాకు నిజంగా దేవుడిచ్చిన గిఫ్టే అంటోంది స్నేహాఉల్లాల్. 'సింహా' నా జీవితంలో మరపురాని సినిమా. పైగా సినిమాకు కేంద్రబిందువు లాంటి పాత్ర లభించడం నిజంగా అదృష్టం. బాలకృష్ణగారితో పనిచేయడం ఎప్పటికీ మరచిపోలేను. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. 'సింహా'ను ఇంత హిట్ చేసిన తెలుగు ప్రజలకు థ్యాంక్స్' అని మురిసిపోతూ చెప్తోంది.
అలాగే ఈ చిత్రం హిట్టవటం గురించి చెబుతూ..చాలా హ్యాపీగా ఉందండీ...సల్మాన్ ఖాన్ నన్ను కథానాయికను చేశారు. దాంతో బాలీవుడ్ లో ఉజ్వల భవిష్యత్తును ఆశించా. కానీ అక్కడి పరిస్థితులు నాకు ఆశాజనకంగా అనిపించలేదు. 'ఉల్లాసంగా.. ఉత్సాహంగా..' ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యా...అనుకోకుండా ఆ చిత్రం ఘన విజయం సాధించింది. అప్పట్నుంచీ ఖాళీ లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాను. నటికి ఇక్కడ లభించే గౌరవం ఎక్కడా లభించదని నాకు అర్ధమైంది. ప్రేక్షకులు కూడా నాపై ప్రత్యేకమైన అభిమానం కనబరుస్తుంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది అంటూ వివరించింది.


Click it and Unblock the Notifications











