తెలుగు హీరోయిన్ కి హాలీవుడ్ ఛాన్స్ !

ఇక గాంధీ పార్క్ సినిమా ఓ కాంటంపరరీ క్రాస్ కల్చర్ రొమాంటిక్ కామెడీ. ఓ ఇండియన్ అమ్మాయి తో అమెరికన్ వైట్ కుర్రాడు ప్రేమలో పడటం ఆ తర్వాత ఇరు కుటుంబాలలో జరిగే పరిణామాలు వివరిస్తుంది. న్యూ డిల్లీ నుండి న్యూయార్క్ వరకూ ప్రయాణించే ఈ కథలో మంచి హ్యూమన్ డ్రామా ఉందంటున్నాడు డైరక్టర్. ఇక ఈ సినిమా స్క్రిప్టు స్ట్రిక్ట్ గా ఉండే కుటుంబ సంప్రదాయాలను పాటించే తల్లితండ్రులను ప్రేమతో యువజంట ఎలా గెలుస్తారన్నది అన్న పాయింట్ చుట్టూ తిరుగుతుంది. మనకి జంధ్యాల గారి దర్శకత్వంలో విజయశాంతి నటించిన పడమట సంధ్యారాగం సినిమా గుర్తుస్తోంది కదా.ఇక ఆ సినిమా షూటింగ్ మొత్తం యు.ఎస్ లో జరుగుతుందంటూ చెప్పుకొచ్చింది. ఇప్పటికే రెండు వారాల షూటింగ్ కూడా ఫినిష్ చేశానని,త్వరలోనే ఆ వివరాలు పూర్తిగా చెపుతానంటోంది.బెస్టాఫ్ లక్ స్నేహా ఉల్లాల్ .


Click it and Unblock the Notifications











