జూ ఎన్టీఆర్ ని ప్రసన్నం చేసుకునే పనిలో జూ ఐష్..
జూ ఎన్టీఆర్ పై మనసు పడిందట జూ ఐష్..అదేనండీ, స్నేహా ఉల్లాల్. బాలకృష్ణ సరసన 'సింహా" సినిమాలో హీరోయిన్ గా నటించిన స్నేహా ఉల్లాల్, ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ని ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా వుంది. తెలుగులో జూ ఎన్టీఆర్ కన్నా గొప్ప డాన్సర్ ఇంకెవరూ లేరని బహిరంగంగా కితాబులిస్తోంది స్నేహా ఉల్లాల్.
అంతే కాదండోయ్, నటనలోనూ జూనియర్ ఎన్టీఆర్ మేటి..అంటోన్న స్నేహా ఉల్లాల్, జూ ఎన్టీఆర్ తో నటించే ఛాన్సొస్తే, రెమ్యునరేషన్ ని గురించి అస్సలు పట్టించుకోనని చెబుతోంది. 'అదుర్స్" లో తన సరసన హీరోయిన్ గా నటించిన షీలాను, బాలకృష్ణ కు పరిచయం చేసిన జూ ఎన్టీఆర్ లాగానే, బాలయ్య కూడా స్నేహా ఉల్లాల్ ని ఈ పాటికే జూనియర్ ఎన్టీఆర్ కి పరిచయం చేసి వుంటాడులే..అంటూ టాలీవుడ్ లో గుసగుసలు విన్పిస్తున్నాయి. వ్యవహారం చూస్తోంటే, ప్రస్తుతం 'బృందావనం", 'శక్తి" సినిమా షూటింగ్ లో బిజీగా వున్న జూ ఎన్టీఆర్ తదుపరి చిత్రంలో హీరోయిన్ గా స్నేహా ఉల్లాల్ ఒకే అయిపోయినా ఆశ్ఛర్యపోనక్కర్లేదేమో..!


Click it and Unblock the Notifications











