‘అలా మొదలైంది’ హిట్టవచ్చు కానీ నా కెరీర్ ని దెబ్బ తీసింది
తెలుగులో రీసెంట్‌గా నేను చేసిన సినిమా 'అలా మొదలైంది".అది నేను మొహమాటంతో ఒప్పుకున్న పాత్రే. సినిమా అయితే నచ్చిందికానీ, నా పాత్రే నచ్చలేదు.అందులో నా నటన అస్సలు సంతృప్తినివ్వలేదు. మరోసారి అటువంటి ప్రాముఖ్యత లేని పాత్రలు చేయకూడదు అని నిశ్చయించుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది స్నేహా ఉల్లాల్.నాని,నిత్యా మీనన్ జంటగా చేసిన ఈ చిత్రంలో ఆమె ఓ చిన్న పాత్రను చేసింది.
సెకెండాఫ్ లో వచ్చే ఈ పాత్ర వల్ల సినిమాకు బాగానే ఉపయోగపడినా ఆమెకు పేరు మాత్రం తీసుకురాలేదు. అలాగే ఉల్లాసంగా ఉత్సాహంగా, సింహా లాంటి విజయాలను అందుకొని కూడా అనుకున్న స్టార్‌డమ్‌ను అందుకోలేకపోయాననే బాధ నాలో చాలావుంది అంది.ప్రస్తుతం ఆమె కన్నడంలో 'దేవి", బెంగాలీలో 'మోస్ట్ వెల్‌కమ్" చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో అల్లరి నరేష్ సరసన ఓ చిత్రంలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











