జూ ఎన్టీఆర్ డాన్సింగ్, యాక్టింగ్ ఎబిలిటీస్ ఎక్స్ ట్రార్డినరీ: స్నేహా
'హాట్ & స్వీట్" మేగి వంటి అమ్మాయి స్నేహ ఉల్లాల్. ఆమె తన తియ్యని అమాయకపు చూపులతో మిమ్మల్ని సమ్మోహన పరచుగలదు, అంతే కాదు. ఆమె అనుకువకు తెలియకుండానే ఆకర్షితులౌతారు. అలాంటి స్వీట్ మేగి జూ ఎన్టీఆర్ ని పడగొట్టే పనిలో పడింది.
సాధారణంగా హీరోయిన్లు తమకు ఫలానా హీరో అంటే ఇష్టమని చెప్పరు. ఒక హీరో పేరు చెబితే మరో హీరో హర్ట్ అవుతాడోమే...తన పక్కన నటించే ఛాన్స్ తనకివ్వడేమోనని భయమే అందుకు కారణం. కానీ జూనియర్ ఐశ్వర్య రాయ్ గా పిలువబడే స్నేహా ఉల్లాల్ మాత్రం అటువంటి భయమన్నది లేకుండా తనకు జూనియర్ ఎన్టీఆర్ అంటే చచ్చేంత ఇష్టమని, అతని డాన్సింగ్, యాక్టింగ్ ఎబిలిటీస్ ఎక్స్ ట్రార్డినరీగా ఉంటాయని, అతనితో నటించే ఛాన్స్ కనుక వస్తే ఎగిరి గంతేస్తానని స్టేట్ మెంట్ ఇచ్చేస్తోంది.
'ఉల్లాసంగా...ఉత్సాహంగా" అనే హిట్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి, 'సింహా" వంటి బ్లాక్ బస్టర్ లో నటించినప్పటకీ స్నేహా ఉల్లాల్ కెరీర్ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. దాంతో వేరే దారి లేక, అల్లరి నరేష్ తో మడతకాజా"లో నటించిన స్నేహా ఉల్లాల్...జూ ఎన్టీఆర్ కు సోపేసే పనిలో పడింది. అన్నట్టు స్నేహా ఉల్లాల్-అల్లరి నరేష్ నటించిన 'మడతకాజా' సినిమా ఈ 30 న రిలీజ్ అవుతోంది. ఇది తనకు మంచి పేరు తెస్తుందని ఆమె ఆశిస్తోంది.


Click it and Unblock the Notifications