జూ ఐశ్వర్య స్నేహా ఉల్లాల్ ప్రేమ, పెళ్ళి కబుర్లు
'మా అమ్మనాన్నలది లవ్ మ్యారేజ్. వారి జంట చూడ ముచ్చటగా ఉంటుంది. ఎప్పుడూ వారిద్దరూ పోట్లాడుకుందే లేదు. వారిద్దరినీ చూస్తే ప్రేమికులంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది. అందుకే నేను కూడా ప్రేమ వివాహాన్నే చేసుకుంటా అంటోంది స్నేహా ఉల్లాల్.అయితే ఆల్రెడీ ఎవరినన్నా లైన్ లో పెట్టి ఈ స్టేట్ మెంట్స్ ఇస్తున్నారా అంటే... ఇప్పటి వరకు ఎవరినీ ప్రేమించలేదని చెబుతోంది. ఒకవేళ ప్రేమిస్తే... మీడియాకే ముందు చెబుతా అని చెప్తోంది.
ఇక 'ఉల్లాసంగా... ఉత్సాహంగా' సినిమాతో తెలుగు పరిశ్రమకి పరిచయం అయిన స్నేహావుల్లాల్ ఆ తరువాత సుశాంత్ సరసన 'కరెంట్' , బాలకృష్ణతో కలిసి 'సింహా' చిత్రాల్లో నటించింది. ఇటీవల విడుదలైన 'అలా మొదలైంది' చిత్రంలోనూ ప్రత్యేకపాత్రలో నటించింది.అయితే ఆమెకు వెన్ను నెప్పి ఉండటంతో వైద్యుల సూచన మేరకు సంవత్సరం పాటు ఆమె రెస్టు తీసుకుంది. ప్రస్తుతం అప్పుడప్పుడు షోరూమ్స్ ప్రారంభోత్సవాల్లోనూ, లక్కీడ్రాల్లోనూ పాల్గొంటూ అభిమానులను అలరిస్తూనే ఉంది.తాజాగా ఆమె అల్లరి నరేష్ సరసన మడత కాజా చిత్రం కమిటైంది.


Click it and Unblock the Notifications











