ముద్దంటే ఇబ్బంది పడుతున్న జూనియర్ ఐష్
ఐశ్వర్యరాయ్‌ని తలపించే రూపంతో జూనియర్ ఐష్ గా పేరు తెచ్చుకుంది స్నేహా ఉల్లాల్. నేనే మీకు తెలుసా సినిమాలో హాట్ సీన్లతో ఆకట్టుకుంది. అయితే తనపై ముద్దు సీన్ల హీరోయిన్ గా ముద్ద పడటం ఇష్టం లేదంటోంది ఈ భామ. ఆ తర్వాత అలాంటి సీన్లతో చాలా సినిమా అవకాశాలే వచ్చినా....చేయడం ఇష్టం లేక వదుకుందట. ఇంతకాలం సినిమా అవకాశాలు ఎందుకు రావడం లేదంటే తాజాగా ఈ కారణం చెబుతోంది స్నేహా ఉల్లాల్.
అప్పుడెప్పుడో ఉల్లాసంగా ఉత్సాహం సినిమా ద్వారా పరిశ్రమలోకి వచ్చిన ఉల్లాల్ తర్వాత చేసిన సినిమాలు చాలా తక్కువే. అన్ని సినిమాలు దాదాపు ప్లాపులే. సింహా సినిమా హిట్టయినా ఈ సినిమా మొత్తం హీరో బాలయ్యే డామినేట్ చేయడంతో అమ్మడు కెరీర్ కు ఆ సినిమా ఒక్క శాతం కూడా ఉపయోగ పడలేదు. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. మిగతా హీరోయిన్లలా ఎక్స్ పోజింగ్, ముద్దు సీన్లతో అవకాశాలు దక్కించుకోవచ్చుకదా అని ఎవరైనా అంటే తన మైండ్ సెట్ మార్చకోను, ముద్దు సీన్లకు ఒప్పుకోను, స్కిన్ షో చేయనుగాక చేయను అంటోంది.
ఈ కాలంలో మడి కట్టుకు కూర్చుంటే పరిశ్రమలో ఎదిగే పరిస్థితి లేదు. టాప్ హీరోయిన్ల సైతం ముద్దు సీన్లు, ఎక్స్ ఫోజింగ్ తో ఎప్పటికప్పడు పరిశ్రమలో తమ స్థాన్ని పదిలం చేసుకుంటున్నారు. మరి ఇలా మడిగట్టుకుని స్నేహా ఉల్లాల్ ఎంత కాలం పరిశ్రమలో నెట్టుకొస్తుందో చూడాలి. ప్రస్తుతం స్నేహ అల్లరి నరేస్ సరసన మడత కాజ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











