ఎక్స్ ఫోజింగ్ ఫలితం-స్నేహ ఉల్లాల్‌కు ఆఫర్
హాట్ హాట్‌గా ఎక్స్ ఫోజింగ్ చేస్తూ వీడీయోలు విడుదల చేసిన హీరోయిన్ స్నేహ ఉల్లాల్ ఎట్టకేలకు అందుకు తగిన ఫలితం పొందింది. ఈ వీడియోలతో అమ్మడుకి పాపులారిటీ రావడంతో పలువురు దర్శక నిర్మాతలు ఆమెతో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు.
తాజాగా స్నేహ ఉల్లాల్‌కు ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో ఆఫర్ వచ్చింది. 'మైత్రి' పేరుతో రూపొందుతున్న ఈచిత్రంలో ఆమె టైటిల్ రోల్ చేయనుంది. ఒక థ్రిల్లింగ్ కథాంశంతో ఈచిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాను ఇందులో మోడర్న్ రాణిగా నటిస్తున్నట్లు స్నేహ చెప్పుకొచ్చింది. ఈచిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
ఉల్లాసంగా, ఉత్సాహంగా చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ఉల్లాల్....తొలిసినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు వరుస ప్లాపులు కావడంతో అమ్ముడుకి అవకాశాలు దూరం అయ్యాయి. ఆ మధ్య ఆమె బాలయ్యతో నటించిన 'సింహా' చిత్రం భారీ విజయం సాధించినప్పటికీ స్నేహకు తగిన గుర్తింపు రాలేదు.
అల్లరి నరేష్‌తో స్నేహ ఉల్లాల్ నటించిన మడతకాజా చిత్రం గత సంవత్సరం విడుదలైంది. అయితే సినిమా ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. దీంతో అవకాశాలు తగ్గిపోయిన స్నేహ ఐటం సాంగులు చేయడానికి సైతం వెనకాడలేదు. అందరి చూపులు తనపై పడేలా చేసుకునేందుకు ఎక్స్ ఫోజింగ్ వీడులను కూడా వదిలింది.


Click it and Unblock the Notifications











