అందరికీ ఆమే కావాలంటే కష్టమే!?

ప్రస్తుతం రెండు సినిమాలు చేతిలో ఉన్నామె తాజాగా నాగార్జున మేనల్లుడు సుసాంత్ హీరోగా చేస్తున్న కరెంట్ సినిమాకు హీరోయిన్ గా సెలక్టయిందని విశ్వసనీయంగా తెలుస్తోంది. సుకుమార్,అల్లరి రవి బాబు వంటి నవతరం దర్శకుల వద్ద అసోసియేట్ గా చేసిన ప్రతాప్ అనే యువకుడు ఈ చిత్రం ద్వారా డైరక్టర్ గా పరిచయమవుతున్నాడు. నవంబర్ నుంచి ప్రారంభమయ్యే ఈ సినిమా లో స్నేహ ది బొమ్మరిల్లు చిత్రంలో హాసిని తరహా పాత్ర అని తెలుస్తోంది. ఇక స్నేహ ఉల్లాల్ మోహన్ బాబు తనయుడు హీరోగా చేస్తున్న నేను మీకు తెలుసా చిత్రంలోనూ, శర్వానంద్ హీరోగా ప్రారంభం కానున్న మరో చిత్రంలోనూ హీరోయిన్ గా చేస్తోంది. త్వరలో మరికొన్ని కమిట్ అవ్వాల్సిఉన్నాయి.


Click it and Unblock the Notifications











