'సింహా' టైమ్ లో ఇంజక్షన్స్ తీసుకుని డాన్స్ చేసా
చాలా కాలం నుంచి నడుం నొప్పితో బాధపడుతున్నాను. సింహా సమయంలో అది మరింత ఎక్కువైంది. పాటల సమయంలో ఇంజక్షన్స్ తీసుకుని మరీ డాన్స్ చేసాను.డాక్టర్స్ విశ్రాంతి తీసుకోమన్నారు. అందుకే సింహా తర్వాత మస్కట్ వెళ్ళిపోయాను అంటోంది స్నేహా ఉల్లాల్. ఆమెను సింహా హిట్టైనా అంత గ్యాప్ వచ్చిందని మీడియా వారు అడిగితే ఇలా సమాధానం ఇచ్చింది. అలాగే సింహా, అలా మొదలైంది లాంటి హిట్టులను నేను సినిమాలుగా మలుచుకోలేదని చాలా మంది అనుకుంటున్నారు. అందులో నిజం లేదు అంది. ఇక తాను ప్రస్తుతం అల్లరి నరేష్ సరసన మడతకాజా చిత్రంతో చేస్తున్నానని, ఆ సినిమా తర్వాత మరిన్ని సినిమాల్లో అవకాశాలు వస్తాయని నమ్మకం ఉందని అంది.
ఇక మడతకాజా చిత్రం గురించి చెబుతూ..తెలుగునాట నోరూరించే స్వీట్ మడత కాజా. సినిమా కూడా అంతే తీయగా ఉంటుంది. నా వరకూ ఓ ప్రత్యేకమైన పాత్ర లభించింది. ఆధునిక యువతిగా ఈ చిత్రంలో కనిపిస్తాను. అయితే సంప్రదాయాలకు కూడా విలవిస్తాను. ఇవి రెండు ఒకే పాత్రలో కనిపించే పాత్ర లభించటం చాలా అరుదు. ఇది వరకు నేను ఎన్ని సినిమాలు చేసినా ఇంత సంతృప్తి దొరకలేదు. నా కష్టానికి తగ్గ ప్రతిఫలం తెర మీద తప్పకుండా కనిపిస్తుంది అంది.


Click it and Unblock the Notifications











