బాలకృష్ణ ప్రక్కన ఆమె ఆనుతుందా?
బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను రూపొందిస్తున్నా 'సింహా' చిత్రంలో స్నేహా ఉల్లాల్ ఓ కీలకమైన పాత్రను పోషిస్తోంది. అయితే బాలకృష్ణ పర్శనాలిటి ముందు ఆమె ఆనుతుందా అని చాలా మంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఓ పెద్ద హీరో ప్రక్కన అవకాశం రావటంతో ఆమె చాలా ఆనందంగా ఉన్నట్లు చెస్తోంది. అందులో ఆమె స్టూడెంట్ పాత్రను చేస్తోంది. ఆమె పాత్రను దర్శకుడు ఎంతో వైవిధ్యంగా మలిచారని, కథా గమనంలో ఆ పాత్ర కీలకంగా వుంటుందని తెలిసింది. ఇక జూనియర్ ఐశ్వర్యారాయ్ అనిపించుకున్న స్నేహ ఉల్లాల్ 'ఉల్లాసంగా..ఉత్సాహంగా' చిత్రంతో తెలుగులో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత మనోజ్‌తో 'నేను మీకు తెలుసా', సుశాంత్ తో 'కరెంట్' చిత్రంలో నటించిన ఈ భామకు ఇప్పుడు ఈ అరుదైన అవకాశం వరించింది. యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నమిత కూడా మరో హీరోయిన్ గా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక 'మిత్రుడు' అనంతరం బాలకృష్ణ చేస్తున్న చిత్రం ఇదే. అలాగే భధ్ర, తులసి అనంతరం చాలా గ్యాప్ తో బోయపాటి హిట్టు కోసం తపిస్తూ చేస్తున్న చిత్రం ఇది.


Click it and Unblock the Notifications











