»   » 3 రోజులుగా గదిలో ఒంటరిగా శ్రీదేవి.... హార్ట్ ఎటాక్ పచ్చి అబద్దం, మరణంపై ఎందుకీ డ్రామాలు?

3 రోజులుగా గదిలో ఒంటరిగా శ్రీదేవి.... హార్ట్ ఎటాక్ పచ్చి అబద్దం, మరణంపై ఎందుకీ డ్రామాలు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీదేవి మరణం నిన్నటి వరకు విషాదం... నేడు మిస్టరీ. దుబాయ్‌లో పరిణామాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. పోలీసు విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ పలు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఫోరెన్సిక్ రిపోర్ట్ చూసిన అనంతరం దేశం మొత్తం నివ్వెర పోయింది. అతిలోక సుందరి అంత దయనీయ స్థితిలో మరణించడం జీర్ణించుకోలేక పోతున్నారు.

అబద్దాలు చెప్పి నమ్మించారు

అబద్దాలు చెప్పి నమ్మించారు

శ్రీదేవి మరణానికి కారణం గుండె పోటు అని చెప్పి ఇప్పటి వరకు అందరినీ నమ్మించారు ఆమె బంధువులు, కుటుంబ సభ్యులు. కానీ సోమవారం విడుదలైన ఫోరెన్సిక్ రిపోర్టులో కార్డియాక్ అరెస్ట్ అనే ప్రస్తావనే లేదు. ప్రమాద వశాత్తు బాత్ టబ్‍‌లో పడిపోవడం వల్ల ఆమె మరణించినట్లు ఫోరెన్సిక్ రిపోర్టులో పేర్కొనబడి ఉంది.

ఎందుకీ డ్రామాలు?

ఎందుకీ డ్రామాలు?

శ్రీదేవి మరణంపై ఎందుకు డ్రామాలు ఆడుతున్నారు? ఆమె మరణం విషయంలో ఎందుకు అబద్దాలు చెబుతున్నారు? అంటూ అభిమానుల్లో అనేక ప్రశ్నలు, అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

అలా చనిపోవడం సాధ్యమేనా?

అలా చనిపోవడం సాధ్యమేనా?

ఫోరెన్సిక్ రిపోర్టులో శ్రీదేవి శరీరంలో మద్యం ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఎంత మద్యం మత్తులో ఉన్నా.... బాత్ టబ్ లో పడి చనిపోవడం జరుగుతుందా? అసలు చనిపోయే ముందు ఆమె కేకలు పెట్టి ఉండరా? కేకలు పెడితే రూములో ఉన్న వారికి వినపడలేదా? అసలు ఆ సమయంలో ఆమెతో ఎవరు ఉన్నారు? అనే విషయంలో క్లారిటీ లేదు.

మూడు రోజులుగా ఒంటరిగా శ్రీదేవి

మూడు రోజులుగా ఒంటరిగా శ్రీదేవి

దుబాయ్‌లోని హోటల్‌లో శ్రీదేవి మూడు రోజులుగా ఒంటరిగా ఉంటోందని, గది నుండి బయటకు రాలేదనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. శ్రీదేవి మరణం తర్వాత ఆమె బస చేసిన హోటల్ పేరు తప్ప ఎలాంటి దృశ్యాలు, మరే ఇతర వివరాలు బయటకు రాకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో ఇంత రహస్యంగా ఎందుకు ఉంటున్నారు అనేది ప్రశ్నార్ధకంగా మారింది.

బోనీ కపూర్ ప్రవర్తనపై అనుమానాలు

బోనీ కపూర్ ప్రవర్తనపై అనుమానాలు

దుబాయ్‌లో బంధువుల పెళ్లి తర్వాత బోనీ కపూర్ వెనక్కి వచ్చేశారని మొదట చెప్పారు. తర్వాత ఇండియా వచ్చి శీదేవిని సర్ ప్రైజ్ చేయడానికి వెనక్కి వెళ్లారనే ప్రచారం జరిగింది. శ్రీదేవి చనిపోయి రెండు రోజులైనా బోనీ కపూర్ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. భారత మీడియాకు, చివరకు దుబాయ్ మీడియాకు కూడా ఆయన అందుబాటులోకి రావడం లేదు.

శ్రీదేవి ఊపిరితిత్తుల్లో నీరు

శ్రీదేవి ఊపిరితిత్తుల్లో నీరు

బాత్ టబ్ లో పడిపోవడం వల్ల శ్రీదేవి ఊపిరితిత్తుల్లో నీరు చేరిందని, అయితే శరీరం మీద ఎలాంటి గాయాలు లేవని ఫోరెన్సిక్ రిపోర్ట్ తెలియజేస్తోంది. ఆమె మరణం వెనక కుట్ర లేదని చెబుతున్నా అభిమానుల్లో అనుమానాలు నివృత్తి కావడం లేదు.

దయనీయ స్థితిలో మరణించిన శ్రీదేవి

దయనీయ స్థితిలో మరణించిన శ్రీదేవి

దేశంకాని దేశంలో అనుమానాస్పదంగా శ్రీదేవి దయనీయ స్థితిలో మరణించడం అభిమానులను కలిచివేస్తోంది. అసలు అతిలోక సుందరి మరణం వెనక వాస్తవాలు తెలియక అభిమానులు అయోమయంలో ఉండిపోయారు.

హోటల్ రూమ్ సీజ్

హోటల్ రూమ్ సీజ్

మరో వైపు శ్రీదేవి బస చేసిన హోటల్ రూమును దుబాయ్ పోలీసులు సీజ్ చేశారు. అవసరం అయితే పోలీసులు మరోసారి రూమును పరిశీలించే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న దుబాయ్ పోలీసులు బోనీ కపూర్‌ను ఇప్పటికే 3 గంటలకు పైగా విచారించారు. ఆయన్ను మరోసారి విచారించే అవకాశం ఉంది.

English summary
Sridevi drowned after losing her balance and falling into the bathtub under the influence of alcohol, fresh reports have claimed. A forensic report has cited accidental drowning as the cause of death, according to Gulf News, tweeted by news agency ANI.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu