twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇలియానా భజన చేస్తున్న రామ్ గోపాల్ వర్మ

    By Srikanya
    |

    రామ్ గోపాల్ వర్మ ఏం రాసినా అది హాట్ టాపిక్ అవుతూంటుంది. తాజాగా ఆయన ఇలియానా గురించి ట్వీట్ చేసారు. అందులో...ది బెస్ట్ ధింగ్ ఎబౌట్ ది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ ది లాస్ట్ సో మెనీ మెనీ ఇయర్స్ ఈజ్ ఇలియానా..ఇలా చాలా కాలం తర్వాత తెలుగు ఇండస్ట్రీకి దొరికిన అధ్బుతం అన్నట్లు ఆమెను మెచ్చుకోవటం ఆశ్చర్యం కలిగించే అంశం అంటున్నారు. ఇన్నాళ్ళూ శ్రీదేవి వెనక పడిన ఆయన హఠాత్తుగా రూట్ మార్చి ఆమెను మెచ్చుకోవటం వెనక ఏదో స్ట్రాటజీ ఉండే ఉంటుందంటున్నారు. అలాగే తాను ఇలియానా తాజా చిత్రం నేనూ...నా రాక్షసి చూడాలని తపించిపోతున్నానని, అందులోని ఇలియానా మాస్క్ సీన్ తనను బాగా ఇంప్రెస్ చేసిందని, ఆ సీన్ లో ఆమె చాలా గార్జియస్ గా ఉందని పొగడ్తల్లో ముంచెత్తారు. అయితే ఇది తన శిష్యుడు పూరీ జగన్నాధ్ మీద ఉన్న అభిమానమంతో సినిమాని ప్రమోట్ చేసే కార్యక్రమమా లేక చాలా కాలంగా రానా కి వేస్తున్న సోప్ లో భాగమా అనేది సినీ జనాన్ని ఆలోచనలో పడేసిన అంశం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X