బెజవాడ రౌడీలుపై ఫిల్మ్ చాంబర్‌లో శోభారాణి వీరంగం

By Nageswara Rao

రాజధాని నగరంలోని ఫిల్మ్ చాంబర్‌లో ప్రజారాజ్యం పార్టీ నేత శోభారాణి మంగళవారం హల్ చల్ సృష్టించారు. నాగచైతన్య ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీస్తున్న బెజవాడ రౌడీలు చిత్రం టైటిల్‌ను మార్చాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మధ్యాహ్నం శోభారాణి ఫిల్మ్ చాంపర్ కార్యాలయానికి వెళ్లింది. అయితే ఆమె వెళ్లిన సమయానికి అక్కడ ఫిల్మ్ చాంపర్ అధికారులు ఎవరూ లేరు. దీంతో రెచ్చిపోయిన ఆమె బెజవాడ రౌడీలు చిత్రం టైటిల్‌ను వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. కార్యాలయంలో ఉన్న కుర్చీలను విసిరేశారు. అంతేకాదు తన పేరు వర్మ నేనో రౌడీని అని ఓ చిత్రం పేరును ధరఖాస్తు చేశారు. కాగా శోభారాణి హల్ చల్ కారణంగా కార్యాలయంలో అలజడి చెలరేగింది. ఆమె హడావుడి సృష్టించిన సమయంలో అధికారులు ఎవరూ లేరు.

కాగా గత కొన్ని రోజులుగా బెజవాడ రౌడీలు చిత్రం టైటిల్‌పై వివాదం నెలకొంటున్న విషయం తెలిసిందే. విజయవాడలో బెజవాడ రౌడీలు షూటింగ్ జరుపుతున్న ప్రాంతంలో స్థానికులు సోమవారం ఆందోళన సైతం చేపట్టారు. విజయవాడ ప్రజలు, పార్టీలకతీతంగా అందరూ రాజకీయ నాయకులు ఆ సినిమా టైటిల్‌ను వ్యతిరేకిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X