చిరు, బాలయ్య, ప్రభాస్, విజయ్ దేవరకొండ చిత్రాలకు అవార్డ్స్, 25న భారీ వేడుక!
అఖిల భారత శోభన్‌బాబు సేవా సమితి ఆధ్వర్యంలో శోభన్‌బాబు పేరుమీద పురస్కారాలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ వేడుక డిసెంబర్ 25 సాయంత్రం 4 గంటల నుంచి హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్నారు.
సినీ ప్రముఖుల ఆధ్వర్యంలో ఈ వేడుక వైభవంగా సాగబోతోంది. అ అవార్డుల కార్యక్రమంలో సీనియర్ నటులు కృష్ణంరాజు.... ప్రసాద్ ల్యాబ్స్ అధినేత ఎ.రమేష్ ప్రసాద్ చేతులమీదుగా జీవన సాఫల్య పురస్కారం అందుకోబోతున్నారు.

శోభన్ బాబు ఎవర్ గ్రీన్ అవార్డులు
కె.రాఘవేంద్రరావు, సి.అశ్వినీదత్, కె.బ్రహ్మానందం, ప్రకాశ్‌రాజ్, రోజా, బి.సత్యానంద్, ఎస్.గోపాలరెడ్డి, దేవిశ్రీప్రసాద్ తదితరులకు శోభన్‌బాబు ఎవర్‌గ్రీన్ అవార్డులు అందించబోతున్నారు.

చిరు, బాలయ్య, ప్రభాస్, విజయ్ దేవరకొండ చిత్రాలకు అవార్డులు
ఇక ఉత్తమ చారిత్రక చిత్రంగా గౌతమిపుత్ర శాతకర్ణి, ఉత్తమ జానపద చిత్రంగా ‘బాహుబలి', ఉత్తమ సాంఘిక చిత్రం ‘ఖైదీ నంబర్ 150', ఉత్తమ ప్రేమకథా చిత్రంగా ‘అర్జున్‌రెడ్డి', ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా ‘శతమానం భవతి', జ్యూరీ అవార్డును ‘మహానుభావుడు' చిత్రానికి అందించబోతున్నారు.

అతిథులుగా
ఈ అవార్డుల కార్యక్రమానికి మరపురాని సీనియర్ నటీమణులు జయచిత్ర, సరిత, భానుప్రియ ప్రత్యేక అతిథులుగా హాజరవుతారు. ఆత్మీయ అతిథులుగా మురళీమోహన్, గిరిబాబు, వి.విజయేంద్రప్రసాద్, తెలంగాణ ఎఫ్‌డిసి ఛైర్మన్ రామ్మోహన్‌రావు, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సి.కళ్యాణ్, మూవీ ఆర్టిస్ట్స్ అసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా, సెక్రటరీ నరేష్ హాజరు కానున్నారు. సంగీత దర్శకుడు కోటి ఆధ్వర్యంలో నిర్వహించే సంగీత విభావరి ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

అవార్డుల వేడుక నిర్వహణ
రచయిత పరుచూరి గోపాలకృష్ణ, నిర్మాత రాశి మూవీస్ నరసింహారావు, దర్శకుడు రేలంగి నరసింహారావుతోపాటు శోభన్‌బాబు సేవా సమితి కన్వీనర్స్ ఎం.సుధాకర్‌బాబు, పూడి శ్రీనివాసరావు, టి.సాయి కామరాజు, బి.బాలసుబ్రహ్మణ్యం, జి.జవహర్‌బాబు, టి.వీర్రపసాద్, కె.శ్రీనివాసకుమార్, బి.శ్రీనివాసరావు, ఎస్.ఎన్.రావు, యు.విజయ్ ఈ అవార్డుల కార్యక్రమానికి సంబంధించిన నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











