Naga Chaitanya Marriage Date: నాగచైతన్య, శోభితా పెళ్లి డేట్ ఫిక్స్.. మ్యారేజ్ ఎప్పుడు? ఎక్కడంటే?
అక్కినేని నట వారసుడు, యువ సామ్రాట్ నాగచైతన్య, బాలీవుడ్ హీరోయిన్ శోభితా వివాహానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. సంప్రదాయ పద్దతిలో ఈ వివాహాన్ని నిర్వహించేందుకు అటు అక్కినేని కుటుంబం, ఇటు ధూళిపాల ఫ్యామిలీ సిద్దమవుతున్నారు. ఇప్పటికే పెళ్లి వేడుకల్లో భాగంగా నిర్వహించే పనులను ప్రారంభించిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా శోభిత వెల్లడించింది. దాంతో వీరి పెళ్లి ఎప్పుడనే విషయంపై అభిమానులు ఆసక్తిగా ఉంటే..సన్నిహితులు ఆరా తీస్తున్నారు. చైతు, శోభిత పెళ్లి తేదీ వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్‌తోపాటు తెలుగులో రాణిస్తున్న శోభిత ధూళిపాలతో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో నాగచైతన్యకు పరిచయమైంది. దాదాపు 2022 సంవత్సరంలో ప్రారంభమైన స్నేహం వారిద్దరిని సన్నిహితంగా మార్చింది. దాంతో ఆ ఇద్దరు కొన్నాళ్లు డేటింగ్ చేస్తూ ట్రావెల్ అయ్యారు. లండన్ వెకేషన్ సందర్బంగా వారిద్దరి ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది.

దాంతో చైతూ, శోభిత ఇద్దరు ప్రేమలో ఉన్నారనే విషయంపై రకరకాల ఊహాగానాలు, రూమర్లు మీడియాలో కనిపించాయి. అయినా ఆ జంట మౌనంగానే ఉంటూ వచ్చింది. తమ ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలకు వివరించారు. చివరకు పెద్దల అంగీకారంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో వారి నిశ్చితార్థానికి మార్గం సుగమమైంది.
మీడియాకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా.. కేవలం తమ కుటుంబానికి చెందిన కొద్ది మంది సమక్షంలో నాగచైతన్య, శోభిత ఎంగేజ్‌మెంట్‌ను ఆగస్టు 8వ తేదీన నిర్వహించారు. అనంతరం కాబోయే దంపతులతో కలిసి ఇరు కుటుంబాలు మీడియాకు ఫోటోలోను రిలీజ్ చేశారు. దాంతో వారి పెళ్లి ఎప్పుడనే ప్రశ్న అప్పుడే మొదలైంది. కానీ పెళ్లి విషయంపై రెండు ఫ్యామిలీలు గుంభనంగానే ఉన్నాయి.

అయితే చై, శోభితా పెళ్లి విషయంలో మరోసారి సీక్రెట్‌గా షాకిచ్చారు. విశాఖపట్నంలో జరిగిన పసుపు దంచే వేడుకను ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి సంప్రదాయంగా నిర్వహించడంతో పెళ్లి తంతు మొదలైందని సమాజానికి వెల్లడించారు. ఈ సందర్భంగా శోభిత ఫోటోలు వైరల్ అయ్యాయి. పూజలు, స్వయంగా పసుపు దంచుతూ టాప్ హీరోయిన్ అయినా తెలుగు వారి ఆచారాలను శ్రద్దగా ఆచరించారనే కామెంట్స్ సోషల్ మీడియాలో కనిపించాయి.
ఇదిలా ఉండగా, పెళ్లికి ముందు హిందూ సమాజంలో జరిగే పసుపు దంచే కార్యక్రమాన్ని అత్యంత శుభసూచకంగా ప్రారంభించారు. అయితే చైతూ, శోభిత పెళ్లిని డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. పెళ్లి వేదిక, తేదీ వివరాలను కొద్ది రోజుల్లో అధికారికంగా వెల్లడిస్తారు అనే విషయాన్ని సన్నిహితులు వెల్లడించారు.
నాగచైతన్య కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం తండేల్ అనే సినిమాలో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందే ఈ సినిమాకు కార్తీకేయ ఫేమ్ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ మూడో వారంలో రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఇక శోభితా కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల పొన్నియన్ సెల్వన్, అలాగే లవ్ సితారా అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆమె నటించిన అమెరికన్ చిత్రం మంకీ మ్యాన్ రిలీజ్ కావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











