నాగ చైతన్య, సమంతపై శోభిత కామెంట్స్.. ఆమె సెలెక్షన్ సూపర్, అతడు మాత్రం అలా అంటూ!

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అవుతోన్న హీరోయిన్లలో శోభిత ధూళిపాళ్ల ఒకరు. దీనికి కారణం ఆమె టాలీవుడ్ హీరో యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్యతో ఎంగేజ్‌మెంట్ చేసుకోవడమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వేడుక జరిగినప్పటి నుంచి తరచూ ఆమె గురించి ఎన్నో రకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. దీంతో ఈ బ్యూటీ హాట్ టాపిక్ అవుతూ హెడ్‌లైన్స్‌లో ఉంటోంది. ఈ నేపథ్యంలో శోభిత ధూళిపాళ్ల.. నాగ చైతన్య, సమంత రూత్ ప్రభుపై చేసిన కామెంట్స్ హైలైట్ అవుతున్నాయి. ఇంతకీ ఆమె ఏం చెప్పిందో మీరే చూసేయండి!

సీక్రెట్‌గా ఇద్దరి లవ్ ట్రాక్
అచ్చ తెలుగు అమ్మాయి అయిన శోభిత ధూళిపాళ్ల అందాల పోటీల్లో గెలిచిన తర్వాత సినిమా రంగం వైపు అడుగు వేసింది. ఈ క్రమంలోనే తెలుగుతో పాటు ఎన్నో భాషల్లో మూవీలు చేసింది. అలా దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. కొంత కాలంగా టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్యతో సీక్రెట్‌గా లవ్ ట్రాక్ నడుపుతోంది. చాలా రోజుల క్రితమే ఈ మేటర్ లీక్ అయింది.

Sobhita Dhulipala Comments on Naga Chaitanya and Samantha Ruth Prabhu

అప్పుడే వార్తలు వైరల్‌గా

అక్కినేని నాగ చైతన్యతో శోభిత ధూళిపాళ్ల లవ్ ట్రాక్ నడుపుతున్న ప్రచారం జరుగుతున్నా దీనిపై సరైన క్లారిటీ మాత్రం రాలేదనే చెప్పాలి. దీనికితోడు సినీ ప్రియులు, అక్కినేని అభిమానులు సైతం ఈ వార్తలను నమ్మలేదు. ఆ సమయంలోనే వీళ్లిద్దరూ ఫారెన్‌లో కలిసి దిగిన ఫొటోలు బయటకు వచ్చాయి. అప్పటి నుంచి నాగ చైతన్య, శోభిత ప్రేమలో ఉన్నారని తేలిపోయింది.

నిశ్చితార్థంతో సర్‌ప్రైజ్
ఎప్పుడైతే నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ఫొటోలు బయటకు వచ్చాయో.. అప్పటి నుంచి వీళ్లిద్దరూ నిశ్చితార్థం చేసుకోబోతున్నాడని వార్తలు ప్రచారం అయ్యాయి. అందుకు అనుగుణంగానే ఆగస్టు 8వ తేదీన వీళ్లిద్దరూ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను అక్కినేని నాగార్జున సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసి దీన్ని అధికారికంగా అనౌన్స్ చేసేశారు.

Sobhita Dhulipala Comments on Naga Chaitanya and Samantha Ruth Prabhu

హాట్ టాపిక్.. వీడియోలే

అక్కినేని నాగ చైతన్య - శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్ చేసుకున్నప్పటి నుంచి ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ ప్రముఖులతో పాటు దేశ వ్యాప్తంగా ఎంతో మంది సినిమా వాళ్లు విషెస్ చెబుతున్నారు. దీంతో నాగ చైతన్య - శోభిత ధూళిపాళ్ల జంట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అలాగే, వీళ్ల పాత వీడియోలు వైరల్ అవుతున్నాయి.

సమంతపై శోభిత అలా
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్యతో ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత శోభిత ధూళిపాళ్ల పాత ఇంటర్వ్యూ ఒకటి హైలైట్ అవుతోంది. ఇందులో ఆమె సమంత గురించి మాట్లాడుతూ.. 'సమంత ఫిల్మోగ్రఫీ, కెరీర్ చాలా సూపర్‌గా ఉంటాయి. సామ్ సెలెక్ట్ చేసుకేనే రోల్స్ ఎంతో అద్భుతంగా ఉంటాయి. అందుకే సమంత స్టార్‌గా పరిశ్రమలో కొనసాగుతోంది' అని చెప్పుకొచ్చింది.

Sobhita Dhulipala Comments on Naga Chaitanya and Samantha Ruth Prabhu

నాగ చైతన్య గురించేమో

ఇదే ఇంటర్వ్యూలో శోభిత ధూళిపాళ్ల తనకు కాబోయే భర్త నాగ చైతన్య గురించి కూడా మాట్లాడింది. 'నాగ చైతన్య చాలా కూల్‌ అండ్ కామ్‌గా ఉంటారు. సెట్స్‌లో కానీ, బయట కానీ అతడు డిగ్నీఫైడ్‌గా ఉంటాడు' అని చెప్పింది. ఒకేసారి సమంత, నాగ చైతన్య గురించి శోభిత కామెంట్స్ చేసిన ఇంటర్వ్యూ కావడంతో ఇది కొద్ది రోజులుగా వైరల్ అవుతూనే ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X