నాజర్ ఇంట్లో రాజమౌళి, శోభు.. మధుర జ్ఞాపకం, ఏ సినిమాలోదో చెప్పండి!
దర్శక ధీరుడు రాజమౌళి, బాహుబలి నిర్మాత శోభుయార్లగడ్డ ప్రముఖ నటుడు నాజర్ ఇంటికి వెళ్లారు. కొంత సమయం వీరిద్దరూ నాజర్ ఇంట్లో గడిపారు. రాజమౌళి తెరకెక్కించిన సింహాద్రి, బాహుబలి వంటి చిత్రాల్లో నాజర్ నటించిన సంగతి తెలిసిందే. రెండు చిత్రాల్లోనూ నాజర్ పోషించినవి కీలకమైన పాత్రలే.
తామిద్దరం నాజర్ ఇంట్లో సరదాగా గడిపినట్లు శోభుయార్లగడ్డ ట్విట్టర్ ద్వారా తెలిపారు. తాను తీపి జ్ఞాపకంగా దాచుకున్న పాతకాలం వస్తువుని రాజమౌళికి నాజర్ గిఫ్ట్ గా అందించారు. పాతకాలంలో వాహనాలకు ఉపయోగించే లైట్ అది. ఈ వస్తువు ఏ చిత్రంలోనిదో చెప్పండి అంటూ శోభుయార్లగడ్డ అభిమానులని సస్పెన్స్ లోకి నెట్టేశారు.

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన కమల్ హాసన్ చిత్రం నాయకుడులోనిది అని ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉండగా రాజమౌళి మరో భారీ చిత్రానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రాంచరణ్ తో త్వరలో మల్టీస్టారర్ చిత్రానికి సన్నాహకాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











