»   » ఇష్టపడి చేసే వాటికి ఆధారాలు ఉండవు: శ్రీరెడ్డి-నాని వ్యవహారంపై దేవి

ఇష్టపడి చేసే వాటికి ఆధారాలు ఉండవు: శ్రీరెడ్డి-నాని వ్యవహారంపై దేవి

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హీరో నాని, శ్రీరెడ్డి మధ్య జరుగుతున్న వ్యవహారం అందరికీ తెలిసిందే. నాని వల్లే తనకు బిగ్ బాస్‌లో అవకాశం పోయిందని శ్రీరెడ్డి ఆరోపించడంతో ఊరుకోకుడా గతంలో సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి తనను సెక్సువల్‌గా వాడుకున్నాడని చెప్పి పెద్ద సంచలనానికి తెరలేపింది. ఆమె వ్యాఖ్యలపై నాని తీవ్రంగా రియాక్ట్ అవ్వడం, లీగల్ నోటీసులు పంపడం తెలిసిందే. నానిపై ఆరోపణలు చేసే క్రమంలో శ్రీరెడ్డి వాడిన భాషపై కొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ ఇద్దరి వ్యవహారంపై సోషల్ యాక్టివిస్ట్ దేవి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.

  అలా చేయడాన్ని ఎవరూ సమర్ధించరు

  అలా చేయడాన్ని ఎవరూ సమర్ధించరు

  శ్రీరెడ్డి కానీ, ఇంకెవరైనా కానీ, ఇద్దరి మధ్య జరిగిన పర్సనల్ వ్యవహారాలను, ఇష్టపడి చేసిన పనులు..... తమ మధ్య చెడిపోయినపుడు బయటకు తీసుకురావడాన్ని ఎవరూ సమర్దించరు. నువ్వు ఏరకమైన భాష వాడావో ఆ భాషను ఎవరూ సమర్ధించరు... అని దేవి అన్నారు.

  Sri Reddy Sensational Comments On Natural Star
  నువ్వు శీలవంతుడివి కాదు అని..

  నువ్వు శీలవంతుడివి కాదు అని..

  అదే సమయంలో ఆమెను.... కేవలం బయటకు వచ్చింది కాబట్టి, తనకు తెలుసో.. లేకమిగిలిన వారి ఒత్తిడికి లొంగో, శీలవంతమైన పాత్రలో నేను ఉన్నాను అని చెప్పడంతో... షి వాంటెడ్ టు బ్రేక్ దట్ ఇమేజ్. నేను చాలా శీలవంతున్ని, పవిత్రుడిని, ఈమె ఇలా చెడిపోయింది కాబట్టి నేను తీసుకోను, ఆమెతో పని చేయను అనడం ఆమెకు బాగా గుచ్చుకున్నట్లు ఉంది. అందుకే ఆమె నువ్వు శీలవంతుడివి కాదు అని నిరూపించడానికి కూర్చుంది... అని దేవి అభిప్రాయ పడ్డారు.

  అలా అనడం కరెక్ట్ కాదు

  అలా అనడం కరెక్ట్ కాదు

  ఆమె క్రూడ్ భాష వాడితే అది ముమ్మాటికీ తప్పే. ఇలా మాట్లాడటం వల్ల అతడి కుటుంబ సభ్యులు హర్టయ్యారా? అంటే దానికి మనం ఏమీ చేయలేం. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతడి ప్రవర్తన వల్ల హర్టయ్యారు.... అతడి ప్రవర్తన ఎలా ఉన్నా ఫర్వాలేదు ఆమె మాట్లాడితే హర్టవుతామనడం కరెక్ట్ కాదు అని దేవి అన్నారు.

  నిజం తెలిసింది అతడికి బుద్ది చెప్పండి

  నిజం తెలిసింది అతడికి బుద్ది చెప్పండి

  మీకు నిజం తెలిసింది కాబట్టి అతడిని బుద్ది చెప్పండి. మళ్లీ భవిష్యత్తులో ఇలా చేయకు... నీ ప్రవర్తన వల్ల మేము ఇలా గాయపడాల్సి వచ్చింది అని వివరించండి దేవి సూచించారు.

   ఇలాంటి వ్యవహారాల్లో ఆధారాలు ఉండవు

  ఇలాంటి వ్యవహారాల్లో ఆధారాలు ఉండవు

  ఇలాంటి వ్యవహారాల్లో ఆధారాలు అనేవి ఉండవు. వాళ్ల ఇద్దరికీ ఇష్టమై జరిగినపుడు ఆధారాలు ఎక్కడి నుండి వస్తాయి? ఆమెకు వ్యతిరేకంగా అతడు, అతడికి వ్యతిరేకంగా ఆమె. అది జరుగలేదని అతనంటాడు... జరిగింది అని ఆమె అంటుంది. మీకెంత తెలుసో నాకూ అంతే తెలుసు. నేనేమీ నిజ నిర్దారణ కమిటీ కాదు కదా. మనం కూడా ఇక్కడ స్పెక్యులేట్ చేస్తున్నాం.... అని దేవి అన్నారు.

  మాట్లాడకూడదు అంటే ఎలా?

  మాట్లాడకూడదు అంటే ఎలా?

  ఆధారాలు లేకుండా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా అంటే.... ఇపుడు ఆమె చేసిన ఆరోపణలకు కూడా ఆధారాలు ఉన్నాయో లేదో మనకు తెలియదు కదా... అతడు వద్దనడం వల్లే అవకాశం రాలేదని ఆమె చెబుతున్నది నిజం అయుండొచ్చు, కాక పోయి ఉండొచ్చు. కాబట్టి ఇలాంటి స్పెక్యులేషన్స్ ఉన్నపుడు ఆమె మాట్లాడకూడదు అంటే ఎలా? అని దేవి ప్రశ్నించారు.

  English summary
  Social activist devi about Sri Reddy and Nani Issue. The issue around Sri Reddy’s allegations on Nani about losing an opportunity in Bigg Boss Telugu doesn’t seem to end any sooner. After much said and done, actor Nani, who is hosting the second season of Bigg Boss Telugu, initiated legal action against Sri Reddy who accused him of exploiting her and denying her an opportunity of being a part of Bigg Boss.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more