twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2.0 మూవీ రివ్యూలు చూసి అభిమానులు షాక్... రియాలా? ఫేకా?

    |

    Recommended Video

    2.0 Movie Reviews Goes Viral On Social Media | Filmibeat Telugu

    రజనీకాంత్ హీరోగా, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రతి నాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన 2.0 మూవీ రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఆన్ లైన్ టికెట్స్ అందుబాటులోకి రాగా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. సినిమా డిమాండుకు తగిన విధంగానే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 10వేల థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, సౌత్ ఈస్ట్, జపాన్ లాంటి దేశాలతో పాటు పాకిస్థాన్లో సైతం విడుదవుతోంది.

    సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్లో రజనీకాంత్, అక్షయ్ కుమార్ సైతం మేము సినిమా ఇంకా చూడలేదని తెలిపారు. ఈ సినిమా ఫస్ట్ అఫీషియల్ స్క్రీనింగ్ ఇంకా ఎక్కడా పడక ముందే సోషల్ మీడియాలో రివ్యూలు హల్ చల్ చేస్తుండటం అభిమానులను ఆశ్చర్య పరుస్తోంది.

    ఎవరు వీరంతా?

    ఎవరు వీరంతా?

    డిస్ట్రిబ్యూటర్ల కోసం వేసిన స్పెషల్ షోలు తాము చూసినట్లు కొందరు, సెన్సార్ సోర్స్ ద్వారా సినిమా గురించిన వివరాలు సేకరించి రివ్యూలు చెబుతున్నట్లు క్లెయిమ్ చేసుకుంటున్నారు. అయితే వీరు చెప్పేది నిజమా? లేక ఫేకా? కేవలం సోషల్ మీడియాలో పాపుల్ అవ్వడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారా? అనేది తెలియడం లేదు.

    <strong>కళ్లు చెదిరేలా 2.0 ప్రీ రిలీజ్ బిజినెస్.. రజనీ మాటలు నిజం కాబోతున్నాయా?</strong>కళ్లు చెదిరేలా 2.0 ప్రీ రిలీజ్ బిజినెస్.. రజనీ మాటలు నిజం కాబోతున్నాయా?

    అంతటా పాజిటివ్ రెస్పాన్స్

    అంతటా పాజిటివ్ రెస్పాన్స్

    అయితే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న 2.0 రివ్యూలన్నీ పాజిటివ్‌గా ఉండటం గమనార్హం. సినిమా అద్భుతంగా ఉందని, ఇండియన్ మూవీ ఇండస్ట్రీని మరో స్థాయికి తీసుకెళ్లే చిత్రమని, భారతీయ సినిమా గర్వపడే చిత్రం అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు.

    ఉమైర్ సంధు సైతం

    మరో వైపు ఉమైర్ సంధు కూడా ఓవర్సీస్ సెన్సార్ బోర్డులో తాను సినిమా చూసినట్లు ప్రకటించాడు. త్వరలోనే పూర్తి రివ్యూ ఇస్తాను అంటూ ట్వీట్ చేశాడు. సినిమా చాలా బావుందని ఉందని, అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అంటూ అభిమానుల్లో సినిమాపై అంచనాలు మరింత పెంచాడు.

    2.0 ఒక విజువల్ వండర్

    2.0 ఒక విజువల్ వండర్

    విజువ‌ల్ వండ‌ర్‌గా రూపొందిన `2.0` చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా న‌వంబ‌ర్ 29న విడుద‌ల కానుంది. భారతీయ చలన చిత్ర చరిత్రలోనే తొలిసారి 600 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కాబోతోంది.ఈ చిత్రాన్ని విజువ‌ల్ వండ‌ర్‌గా తీర్చిదిద్ద‌డానికి 2150 వి.ఎఫ్‌.ఎక్స్ షాట్స్ ఉప‌యోగించారు. 3000 మంది వి.ఎఫ్‌.ఎక్స్ టెక్నీషియ‌న్స్.. 1000 టిపిక‌ల్ వి.ఎఫ్‌.ఎక్స్ షాట్ మేక‌ర్స్ ఈ సినిమా కోసం ప‌నిచేశారు.

    English summary
    "2Point0 will Blow your mind !! What a Cinematic Experience. Just OUTSTANDING ! Detail Review very soon." Umair Sandhu tweeted. Shankar is set to take indian Cinema to the next level with his latest venture 2.0.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X