2.0: ఆ ట్వీట్ చూసి తెలుగు ఫ్యాన్స్‌కి మండుతోంది... ప్రభాస్ ఫ్యాన్స్ ఇలా!

Recommended Video

#2point0 : Social Contention Between 2.0 Baahubali Fans | Filmibeat Telugu

బాహుబలి ముందు వరకు ఇండియాలో భారీ సినిమాలు తీసేది ఎవరు? అంటే శంకర్ పేరు మాత్రమే వినిపించేది. అయితే రాజమౌళి బాహుబలితో వచ్చి టాలీవుడ్ దర్శకుల్లోనూ హాలీవుడ్ స్థాయి సినిమాలు తీసే సత్తా ఉందని నిరూపించాడు.

ఆ సమయంలో సోషల్ మీడియాలో తెలుగు, తమిళ సినీ అభిమానుల మధ్య కామెంట్ల యుద్ధం జరిగింది. రాజమౌళి, శంకర్‌లను కంపేర్ చేస్తూ ఇదరు వర్గాల అభిమానులు వాదించుకున్నారు. తెలుగు అభిమానులు మా రాజమౌళి గొప్పోడని.... తమిళ అభిమానులు శంకర్ త్వరలోనే మీ నోరు మూయిస్తాడంటూ ఒకరిపై ఒకరు కామెంట్లు గుప్పించుకున్నారు.

తాజాగా 2.0 సినిమా విడుదలైన నేపథ్యంలో మరోసారి ట్విట్టర్లో ఇలాంటి వాతావరణమే కనిపిస్తోంది.

ఆ ట్వీట్ చూసి తెలుగు వారికి మండిపోతోంది

2.0 చిత్రం బాహుబలిని మించి పోతోంది అనే సిగ్నల్స్ ఇస్తూ తమిళ అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేయడం మొదలు పెట్టారు. తమిళ ఫ్యాన్స్ వేషాలు చూసి తెలుగు అభిమానులకు మండి పోతోంది.

బాహుబలి రికార్డులు జాగ్రత్త అంటూ వెటకారాలు

మీ బాహుబలి రికార్డులు తుడిచిపెట్టుకుపోతున్నాయి జాగ్రత్త అంటూ కొందరు తమిళ అభిమానులు సోషల్ మీడియాలో వెటకరాలు ప్రదర్శిస్తుండటం టాలీవుడ్ అభిమానులను చిర్రెత్తిస్తోంది.

ఓవరాక్షన్ మరీ ఎక్కువైంది

ఇలాంటి ట్రోల్స్ మరీ ఓవర్‌గా ఉన్నాయని. తమ హీరోపై అభిమానం ప్రదర్శించుకోవడం వరకు ఓకే కానీ ఇలాంటి చర్యలు సరికాదంటున్నారు తెలుగు ఫ్యాన్స్.

ప్రభాస్ ఫ్యాన్స్ ఇలా

అయితే ప్రభాస్ అభిమానులు, మరికొందరు తెలుగు ఫ్యాన్స్ మాత్రం 2.0 చిత్రాన్ని విష్ చేస్తూ తమ హుందాతనాన్ని చాటుకుంటున్నారు.

మరికొన్ని ఫన్నీ ట్వీట్స్

దీంతో పాటు రజనీ అభిమాలపై కొన్ని ఫన్నీ ట్వీట్స్ సైతం సర్య్కులేట్ అవుతూ అభిమానులను నవ్విస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X