»   » సందేశంతోపాటు చక్కని కామెడీతో సోడా.. గోళీ సోడా..

సందేశంతోపాటు చక్కని కామెడీతో సోడా.. గోళీ సోడా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సోడా.. గోళి సోడా చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నది. ఈ చిత్రం ఉభయ‌గోదావ‌రి జిల్లాల్లోని అమ‌లాపురం, పాల‌కొల్లు లాంటి అంద‌మైన ప్ర‌దేశాల్లో మొద‌టి షెడ్యూల్ పూర్తిచేసుకున్నది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోని ప‌లు ప్రాంతాల్లో రెండ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఆగస్టులో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నది.

ఆగస్టులో విడుదల చేస్తున్నాం

ఆగస్టులో విడుదల చేస్తున్నాం

ఎస్బీ ఆర్ట్ క్రియోష‌న్స్ బ్యాన‌ర్‌పై భువ‌న‌గిరి స‌త్య సింధూజ నిర్మాతగా మొట్ట‌మెద‌టిసారిగా నిర్మిస్తున్న చిత్రం సోడా గోలి సోడా. ఈ చిత్రం ద్వారా మ‌ల్లూరి హ‌రిబాబు ద‌ర్శ‌కుడి గా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈచిత్రంలో ప్ర‌ముఖ క‌మెడియ‌న్స్ ఆలీ, కృష్ణ‌భ‌గ‌వాన్‌, గౌతంరాజు, ప్ర‌భాస్ శ్రీను, దువ్వాసి మెహ‌న్‌, అపూర్వ‌, జ‌య‌వాణి న‌టిస్తున్నారు. ఆగ‌ష్టులో చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌టానికి నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేస్తున్నారు.

క్లారిటీతో తెరకెక్కుతున్నది

క్లారిటీతో తెరకెక్కుతున్నది

ఈ సంద‌ర్బంగా నిర్మాత భువ‌న‌గిరి స‌త్య సింధూజ మాట్లాడుతూ.. ఎంత మంచి చిత్రానికైనా కామెడి చాలా అవ‌స‌రం. అందుకే మా చిత్రంలో మంచి సందేశంతోపాటు చ‌క్క‌ని కామెడీని అందిస్తున్నాం. ప్ర‌ముఖ క‌మెడియ‌న్స్ ఆలీ, కృష్ణ‌భ‌గ‌వాన్‌, ప్ర‌భాస్ శ్రీను, గౌతం రాజు, జ‌బ‌ర్ద‌స్త్ ఆది తమ కామెడీతో ప్రేక్ష‌కులను ఆకట్టుకొంటారు. ద‌ర్శ‌కుడు హ‌రిబాబు చాలా క్లారిటితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు అని తెలిపారు.

కమర్షియల్‌ అంశాలతోపాటు వినోదం

కమర్షియల్‌ అంశాలతోపాటు వినోదం

ద‌ర్శ‌కుడు హ‌రిబాబు మాట్లాడుతూ.. నేను చెప్పిన క‌థ నమ్మి ఈ సినిమాను నిర్మిస్తున్న స‌త్య సింధూజకు నా ధ‌న్య‌వాదాలు. సినిమా అన‌గానే క‌మ‌ర్షియ‌ల్‌గా ఈ క‌థ తెర‌కెక్కిస్తే ప‌దిమంది హాయిగా న‌వ్వుకోవాలనే స‌దుద్దేశంతో నిర్మిస్తున్నాం. కెమెరామెన్ ముజీర్ మాలిక్ ప్ర‌తి ఫ్రేమ్‌ను రిచ్‌గా తెరకెక్కిస్తున్నారు అని అన్నారు.

నటీనటులు వీరే..

నటీనటులు వీరే..

ఈ చిత్రంలో మాన‌స్‌, నిత్యాన‌రేష్‌, కారుణ్య‌, ఆలీ, గౌతంరాజు, కృష్ణ‌భ‌గ‌వాన్, ప్ర‌భాస్ శ్రీను, దువ్వాసి మెహ‌న్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, హైప‌ర్ ఆది, తోట‌ప‌ల్లి మ‌ధు, జ‌భ‌ర్ద‌స్త్ అప్పారావు, జ‌య‌వాణి, అపూర్వ‌, మాధ‌వి త‌దిత‌రులు నటిస్తున్నారు. సంగీతం: భ‌ర‌త్‌, పాట‌లు: రెహ‌మాన్‌, శివ‌న‌రేష్‌, కెమెరా.. ముజీర్ మాలిక్‌ అందిస్తున్నారు.

English summary
Soda Goli soda is set release in August. Sai Sindhuja is producer and Haribabu malluri is the director. This movie is mix of message and Comedy. Hyper Aadi, Krishna Bhagavan, Aali are cating in this movie.
Please Wait while comments are loading...