»   » షాక్ మీద షాక్: కాబోయేవాడితో.... అర్దనగ్నంగా ఫోజులు (ఫోటోస్)

షాక్ మీద షాక్: కాబోయేవాడితో.... అర్దనగ్నంగా ఫోజులు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

  హైదరాబాద్: బాలీవుడ్ నటి, మోడల్ సోఫియా హయత్ ఉన్నట్టుండి సన్యాసం(నన్) పుచ్చుకుని దైవచింతనలో మునిగిపోయి అందరికీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. కొంతకాలం దైవ చింతనలో మునిగిపోయిన ఈ భామ మరోసారి అందరికీ షాకిస్తూ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది.

  కాబోయే వాడు

  తాను ఓ వ్యక్తిని పెళ్లిచేసుకోబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా సోఫియా కొన్ని రోజుల క్రితం వెల్లడించిన సంగతి తెలిసిందే. త్వరలోనే అతడి పేరు వివరాలు వెల్లడిస్తానని చెప్పిన ఆమె.. తాజాగా అందుకు సంబంధించిన వివరాలతో పాటు అతడి ఫోటోలను కూడా రిలీజ్ చేసింది.

  ఎవరు ఇతగాడు

  సోఫియా పెళ్లాడబోతున్న వ్యక్తి పేరు వ్లాడ్ స్టనెస్క్యూ. ప్రొఫెషన్ పరంగా అతడో ఇంటీరియర్ డిజైనర్, పెర్ఫ్యూమ్ ఎంథసిస్ట్. తన బాయ్ ఫ్రెండ్ టోటల్ జెంటిల్ మెన్ అని సోఫియా చెప్పుకొచ్చింది.
  అతడితో కలిసి అర్దనగ్నంగా దిగిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది.

  దేవుళ్లంతా పెళ్లికి వస్తున్నారట

  మార్చి మూడో లేదా నాలుగో వారంలో తన వివాహం జరగబోతోందని, మా ప్రేమ పెళ్లి చాలా పవిత్రమైనది. శివుడు, బుద్ధుడు సహా దేవుళ్లంతా నా పెళ్లికి హాజరుకాబోతున్నారు. స్వర్గంలో ఏసుప్రభు ఈ పెళ్లిని నిర్ణయించాడు అని సోఫియా తన పోస్టులో పేర్కొన్నారు.

  కొంతకాలంగా డేటింగ్

  ఇద్దరూ కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారు. అతడితో పరిచయం అయ్యాకే అమ్మడు సన్యాసం వదిలేసి మళ్లీ సంసార సుఖంలో మునిగి తేలాలని నిర్ణయించుకుందట. మళ్లీ తన మనసు మారకముందే వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయింది.

  అందుకే గోప్యంగా

  నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరు? అనే వివరాల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. కావాలనే అతని వివరాలు గోప్యంగా ఉంచాను. అతడు సెలబ్రిటీ కాదు, పేరు బయటకు తెలిస్తే అనవసరంగా ఇబ్బంది పడతారనే ఇలా చేసినట్లు సోఫియా హయత్ తెలిపారు.

  సోఫియా

  తన వివాహానికి దేవుళ్లు హాజరవుతారు అని సోఫియా హయత్ చెప్పడాన్ని కొందరు మరోలా అర్థం చేసుకుంటున్నారు. కొందరు ఆమె మానసిక స్థితిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే వెంట వెంటనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని అంటున్నారు.

  English summary
  After shocking the world with her transformation as a nun, Sofia Hayat dropped another bomb on our head when she announced that she was engaged. The British model told the world that her guy was a total gentleman. Well, she has finally revealed him to the world. Sofia’s fianc Vlad Stanescu is an interior designer by profession and also a perfume enthusiast.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more