ఆ సినిమా ఎఫెక్ట్ తో.. బూతు సినిమాల వరద
1978లో వచ్చిన రతి నిర్వేదం చిత్రం రీమేక్ ఈ మధ్యన వచ్చి సూపర్ హిట్టైంది. ఆ రీమేక్ తెలుగులో సైతం డబ్బింగ్ అయ్యి హిట్టు అయ్యింది. దాంతో ఈ చిత్రం రీమేక్ ఇచ్చిన ప్రేరణతో మళయాళంలో వరసగా పాత బూతు సినిమాలు రీమేక్ లు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఆమె రాత్రులు 1978లో ఈ చిత్రాన్ని ఐవి శశి డైరక్ట్ చేసారు. అలాగే ఆంధోని...డైరక్ట్ చేసిన 1981 చిత్రం పార్టనర్ కోసం వెతుకులాట అనే అర్దం వచ్చే ఈ చిత్రం కూడా రీమేక్ కాబోతోంది. అలాగే మరెన్ని పాత బూతు చిత్రాలు హఠాత్తుగా తెరకెక్కటానికి ముస్తాబు అవటం మళయాల సినిమా మేధావులను షాక్ కి గురి చేస్తోంది.
ఈ ట్రెండ్ ఎక్కడిదాకా వెళ్తుందో అని వారు భయపడుతున్నారు. అప్పట్లో ఆ చిత్రాల వరసను కంటిన్యూ చేస్తూ షకీలా వంటి శృంగార తారలు వెలిసారు. ఇప్పుడు కూడా అలాంటిదేదన్నా జరుగుతుందేమో అని అనుమానిస్తున్నారు. మరోప్రక్క బాలీవుడ్ లో సైతం డర్టీ ఫిక్చర్ హిట్ అవటంతో ఆ తరహా చిత్రాలుకు అక్కడ కూడా విపరీతమైన ప్రయత్నాలు మొదలయ్యాయి. బూతే భాక్సాఫీస్ ని జయించే మార్గమని అక్కడ నిర్మాతలు సైతం భావిస్తున్నారు.
ఇక తెలుగు విషయానికి వస్తే ఇక్కడ ఈరోజుల్లో చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో బూతు డైలాగులకు,సజెస్టివ్ బూతుకి లోటు లేదు. దాంతో ఈ తరహా సినిమాలు తెలుగులో చేయాలని చాలా మంది దర్శక,నిర్మాతలు అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించారు. తక్కువ బడ్జెట్ లో సినిమా పూర్తి చేయటం, బూతుని సాధ్యమైనంత గుప్పించటం ఈ తరహా సినిమాల లక్ష్యం.
తమిళంలో సైతం ఇలాంటి సినిమాలు ఆర్ట్ సినిమాలు ముసుగులో తీసి అనాగరికం వంటి పేర్లతో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలు తక్కువ బడ్జెట్ లో నిర్మితమవటం,యూత్ ని టార్గెట్ చేయగలగటం,ఎక్కువ సాంకేతిక విలువల అవసరంలేకపోవటం,డబ్బింగ్ కి ఇలాంటి సినిమాలు అనువుగా ఉండటం కలిసి వస్తోంది. కాబట్టి కొంత కాలం దాకా ఇలాంటి సినిమాల వరద తప్పదు. అందులోనూ ఒక భాషలో తయారైనవి మిగతా భాషల్లోకి వెళ్లటం ఈ సినిమాలకు పెద్ద పెట్టుబడి.


Click it and Unblock the Notifications











