బర్త్ డే స్పెష్: ‘సోగ్గాడే చిన్ని నాయనా’ టీజర్ (వీడియో)
హైదరాబాద్: టాలీవుడ్ మన్మధుడు నాగార్జున 57వ పుట్టినరోజు సందర్భంగా ఆయన తాజా సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయనా' టీజర్ విడుదల చేసారు.
సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున తాత, మనవడు పాత్రల్లో డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. ఈ రెండు పాత్రలకు రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి (‘అందాల రాక్షసి' ఫేం) కథానాయికలుగా నటిస్తున్నారు. నాగార్జున సరసన అనసూయ మరదలి పాత్రలో నటిస్తోందని సమాచారం.

సోగ్గాడే చిన్ని నాయనా షూటింగ్ పూర్తయ్యే వరకు నాన్ స్టాప్ గా సాగుతుంది. లవ్లీ అనసూయ కూడా ఓ ఎంటర్టెనింగ్ సీన్ కోసం షూటింగులో జాయిన్ అయింది అని నాగార్జున తెలిపారు. సినిమాలో నాగార్జున, అనసూయల మధ్య బావా మరదళ్ల సరసాలు, రొమాంటిక్ సీన్లు ఉంటాయని టాక్. నాగార్జునతో కలిసి ఓ పాటలో ఆమె డాన్స్ కూడా చేస్తుందట. హాట్ అండ్ సెక్సీ లేడీ, ఐటం గర్ల్ హంసా నందిని కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు ‘ఉయ్యాలా జంపాలా' నిర్మాత రాధా మోహన్ కథ, స్క్రీన్-ప్లే అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











