For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంతకీ కృష్ణ కుమారి ఎవరు?: నాగ్ డౌట్

By Srikanya
|

హైదరాబాద్: నాగార్జున ద్విపాత్రాభినయం చేసి విడుదలకు సిద్దంగా ఉన్న సినిమా 'సోగ్గాడే చిన్ని నాయిన'. సంక్రాంతి కానుకగా జనవరిలో 15న రిలీజ్ కు సిద్దం అవుతున్న ఈ చిత్రానికి ప్రమోషన్స్ వేగం పెంచారు. అందులో భాగంగా చిత్రం కొత్త ప్రోమో వదిలారు. ఎవరు కృష్ణ కుమారి అంటూ ఈ ప్రోమో సాగుతుంది. చివర్లో కృష్ణ కుమారి ఎవరో నాగార్జున క్లారిటీ ఇస్తారు. ఆ ప్రోమో మీరు చూసేయండి మరి.

గ్రామీణ నేపథ్యంలో సాగే ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ చిత్రంలో తండ్రి పాత్ర ఇందులో ఘోష్ట్‌గా కనిపిస్తుందని, చనిపోయిన తర్వాత కొడుక్కుమాత్రమే కనబడే విచిత్రమైన ఆ పాత్రలో తాను నటించానని నాగార్జున తెలిపారు.

ఇక ఈ సినిమాకు సంబందించిన బిజినెస్ ఓ ప్రక్కన జరుగిపోయింది. ఈ సినిమాను భారీ రేటు పెట్టి శాటిలైట్ రైట్స్ ను జెమినీ టీవి వారు తీసుకున్నారు. దీనికి ఆరున్నర కోట్లను చెల్లించనున్నారని సినిమా వర్గాలు అనుకుంటున్నాయి. నాగార్జున సినిమాలకు టీవి మాధ్యమంలో మంచి క్రేజ్ ఉండటంతో ఈ మొత్తాన్ని పెట్టి జెమినీ వారు తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు.

‘Soggade Chinni Nayana’ : Who Is Krishna Kumari promo

కాకపోతే ఇప్పుడు ఈ సినిమాకు హిందీలో కూడా మార్కెట్ బాగానే జరుగుతోంది, దీనిని సుమారు కోటి రూపాయలతో నిర్మాల కుమారి అనే తర్డ్ పార్టీ పేరున నిర్మాతలు హింది శాటిలైట్ హక్కులను అడిగి తీసుకున్నట్లు సమాచారం.

నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి, నాజర్‌, బ్రహ్మానందం, సంపత్‌,నాగబాబు, సప్తగిరి, పోసాని కృష్ణమురళి, హంసానందిని, యాంకర్‌ అనసూయ, దీక్షా పంత్‌, బెనర్జీ, సురేఖా వాణి, దువ్వాసి మోహన్‌, రామరాజు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: పి.రామ్మోహన్‌, స్క్రీన్‌ప్లే: సత్యానంద్‌, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌, సిద్ధార్థ్‌ రామస్వామి, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, నిర్మాత: అక్కినేని నాగార్జున, మాటలు-దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ.

English summary
Soggade Chinni Nayana coming telugu film, Starring Nagarjuna in a dual role while Ramya Krishnan and Lavanya Tripathi would be seen as the female leads, directed by debutante director Kalyan Krishna and produced by Annapurna Studios..
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more