బాహుబలి3.. ఆస్థాయి చిత్రం తెరకెక్కితే 10 వేల కోట్ల వసూళ్లు.. సోహన్ రాయ్
భారతీయ చిత్ర పరిశ్రమతను ప్రపంచంతో ఏకం చేసే ఓ వేదికగా రూపొందిన ఇండీవుడ్ సంస్థ తన మూడో కార్నివాల్‌ను డిసెంబర్ 1న హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో ప్రారంభించింది. రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించడం ఇది వరుసగా రెండోసారి. గతేడాది సెప్టెంబర్‌లో ఈ కార్నివాల్‌ను విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సంస్థ సీఈవో సోహన్ రాయ్ మీడియాతో ముచ్చటించారు.

సినీ పరిశ్రమను ఏకం చేస్తాం..
ప్రపంచ సినిమాతో భారతీయ సినీ పరిశ్రమను ఏకం చేసే లక్ష్యానికి దగ్గర్లోనే ఉన్నామని ఇండీవుడ్ చైర్మన్ సోహన్ రాయ్ తెలిపారు. మరో ఐదేళ్లలో అనూహ్యమైన ఫలాలను అందుకొంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

చిత్ర పరిశ్రమలో అనూహ్య మార్పులు
భారతీయ సినిమా పరిశ్రమలో అనేక మార్పులు చోటుచేసుకొంటున్నాయి. గతంలో సినిమాల ద్వారా వచ్చే ఆదాయం రూ.100 కోట్లు మాత్రమే ఉండేది. ఈ ఏడాది బాహుబలి, దంగల్ చిత్రాలు అనూహ్యమైన విజయాలు సాధించాయి. ఆ చిత్రాలు దాదాపు 2 వేల కోట్ల వసూళ్లకు చేరువైనాయి అని అన్నారు.

10 వేల కోట్ల వసూళ్లు
భవిష్యత్‌లో బాహుబలి3 తెరకెక్కినా.. లేదా ఆ స్థాయిలో ఏదైనా చిత్రం రూపొందింతే వసూళ్లు రూ.10 వేల కోట్లకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. భారతీయ సినిమా పరిశ్రమకు ఇలాంటివి శుభపరిణామం.

మల్టీప్లెక్స్‌లలో టీ10 మ్యాచ్‌లు
సినిమా పరిశ్రమను కొత్త పుంతలు తొక్కించడానికి మల్టీప్లెక్స్‌ల నిర్మాణం చేపడుతున్నాం. ఇందుకోసం కొత్తగా కాన్సెప్ట్‌ను డిజైన్ చేస్తున్నాం. 24 గంటలపాటు మల్టీప్లెక్స్‌లు పనిచేస్తాయి. త్వరలోనే టీ10 క్రికెట్ మ్యాచ్‌లను ప్రారంభించనున్నాం. ప్రతీ మ్యాచ్ 90 నిమిషాలు ఉంటుంది. ఆ మ్యాచ్‌లను మల్టీప్లెక్స్‌లో ప్రదర్శిస్తాం అని సోహన్ రాయ్ తెలిపారు.


Click it and Unblock the Notifications