అందుకే ఆ వీడియోలు పెట్టడం లేదు.. ఆరోగ్య పరిస్థితిపై సోహెల్ క్లారిటీ
బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ స్టార్. కథ వేరే ఉంటది అంటూ నిజంగానే బిగ్ బాస్ కథను మార్చేశాడు. ఫినాలే ఎపిసోడ్‌లో ఎవ్వరూ ఊహించని అడుగేసి క్రెడిట్ కొట్టేశాడు సోహెల్. 25 లక్షల క్యాష్ ప్రైజ్ మనీతో పాటు అభిమానుల ప్రేమను సంపాదించుకున్నాడు సోహెల్. హీరోగా వెండితెరపై రాణించాలనేది తన కోరిక అంటూ ఎన్నో సార్లు చెప్పుకొచ్చాడు. ఎన్నో సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించిన సోహెల్ మొదటిసారి హీరోగా మారాడు.
Recommended Video

బిగ్ బాస్ అనంతరం..
బిగ్ బాస్ షోలో సోహెల్ ఎంతగా అల్లరి చేశాడో అందరికీ తెలిసిందే. అన్ని రకాల ఎమోషన్స్‌ను చూపించిన సోహెల్‌కు మంచి క్రేజ్ వచ్చింది. కోపం, ప్రేమ, స్నేహం, టాస్కులు ఇలా ప్రతీ ఒక్క అంశంలో సోహెల్ తన ముద్ర వేశాడు. నాల్గో సీజన్ కంటెస్టెంట్లందరిలోనూ ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ అనంతరం వెంటనే ఓ సినిమాను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ప్రీ ప్రొడక్షన్ పనులు..
అయితే తన కొత్త సినిమాను ప్రకటించి రెండు నెలలు దాటిపోయింది. ఆ మధ్య మాట్లాడుతూ.. ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభం కాబోతోందంటూ తెలిపాడు. కానీ అది జరగలేదు. ఆలస్యం అవుతూనే వచ్చింది. మొత్తానికి ఎట్టకేలకు ముహూర్తం సెట్ అయింది. సినిమా షూటింగ్ నేడు ప్రారంభం కానుంది. ఈ మేరకు సోహెల్ ఓ వీడియోను షేర్ చేశాడు.

నిత్యం అలా..
ప్రస్తుతం సోహెల్ తన సినిమా కోసం శరీరాకృతిని మార్చుకునే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో రోజూ జిమ్‌లో వ్యాయామం చేసే వీడియోలను షేర్ చేస్తుంటాడు. కానీ గత రెండు మూడు రోజులుగా ఎలాంటి వీడియోలను షేర్ చేయడం లేదు. దీనిపై సోహెల్ క్లారిటీ ఇచ్చాడు.

అనార్యోగంగా..
కొన్ని రోజులుగా వర్కవుట్ వీడియోలను షేర్ చేయడం లేదు.. నాకు కొంచెం వైరల్ ఫీవర్ వచ్చింది.. ఇప్పుడు బాగానే ఉన్నాను.. అందుకే వీడియోలను షేర్ చేయడం లేదంటూ తాజాగా సోహెల్ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా తన కొత్త సినిమా అప్డేట్ గురించి చెప్పుకొచ్చాడు.

ఫస్ట్ లుక్ నేడే..
నేడు నా సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది.. అంతే కాకుండా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయబోతోన్నారంటూ సోహెల్ ఓ వీడియోను విడుదల చేశాడు. మొత్తానికి గుబురు గడ్డంతో మంచి మాస్ లుక్‌లోకి సోహెల్ మారిపోయాడు. ఇక ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు మరికాసేపట్లో బయటకు రానున్నాయి.


Click it and Unblock the Notifications











