ఆ విషయం తెలిసి ఎంతో సంతోషమేసింది.. సోహెల్ కామెంట్స్ వైరల్
బిగ్ బాస్ షోలో సోహెల్ ఎంతగా సందడి చేశాడో.. షో ముగిసిన తరువాత అంతకు మించి రచ్చ చేస్తున్నాడు. సోహెల్ కనిపించని ఎపిసోడ్ ఉండదంటే అతిశయోక్తి కాదు. అలా బిగ్ బాస్ ఇంట్లో ప్రతీ విషయంలో సోహెల్ హస్తం ఉంటుంది. అది ఫ్రెండ్ షిప్ అయినా గొడవలు అయినా కామెడీ అయినా సీరియస్ అయినా కూడా ప్రతీ దాంట్లో సోహెల్ పేరు వస్తుంది. అలాంటి సోహెల్ ఇప్పుడు కూడా ట్రెండ్ అవుతున్నాడు.

మొత్తం సోహెల్ చుట్టే..
బిగ్ బాస్ షో నడిచిన సమయంలో సోహెల్ ట్రెండ్ అయ్యాడు. అది కొన్ని సార్లు నెగెటివ్‌గా వెళ్లినా కూడా సోహెల్ పేరు మాత్రం మార్మోగిపోయింది. బిగ్ బాస్ షో గడిచిన తరువాత కూడా సోహెలే ట్రెండ్ అయ్యాడు. ఫినాలె ఎపిసోడ్ అయిన వారం రోజులు ఎక్కడ చూసినా సోహెల్ పేరే ఎక్కువగా వినిపించింది.

ఆ ఘటనతో వైరల్..
మెహబూబ్ హింట్ వీడియోల, 25 లక్షలు తీసుకుని బయటకు రావడం వంటి ఘటనలతో సోహెల్ విపరీతంగా వైరల్ అయ్యాడు. నెగెటివ్. పాజిటివ్ అన్ని విధాల సోహెల్ టార్గెట్ అయ్యాడు. ఏది ఏమైనా కూడా సోహెల్ పేరు మాత్రం నిత్యం ట్రెండింగ్‌లోనే ఉంది.

నెల దాటినా కూడా..
బిగ్ బాస్ షో గడిచి నెల రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ కంటెస్టెంట్లందరిలోనూ సోహెల్ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. సినిమా అనౌన్స్ చేయడమైనా కావొచ్చు.. స్పెషల్ ఇంటర్వ్యూలు కావొచ్చు.. ఈవెంట్లు, షోలు ఇలా ఏదైనా కావొచ్చు. కానీ సోహెల్ అన్నింటా వైరల్ అవుతున్నాడు.

అందరితో కలుస్తూ..
సోహెల్ ముఖ్యంగా బిగ్ బాస్ కంటెస్టెంట్లను ఎక్కువగా కలుస్తున్నాడు. అలీ రెజా, రాహుల్, మెహబూబ్, అఖిల్, మోనాల్, అరియానా ఇలా అందరితో కలుస్తూ ట్రెండ్ అవుతున్నాడు. నాగార్జున, చిరంజీవి, విశ్వక్ సేన్ ఇలా సెలెబ్రిటీలను కలుస్తూ హాట్ టాపిక్ అవుతున్నాడు.

అది విన్నాక..
అయితే తాజాగా సోహెల్ తన బిగ్ బాస్ మేట్స్‌ను కలిశాడు. అవినాష్, అరియానా, మోనాల్‌లను కలిసిన ఫోటోను షేర్ చేశాడు. ఎవరో చెబుతుంటే విన్నాను.. బిగ్ బాస్ గురించి ట్రెండ్ అయిన దాంట్లో సోహెల్ పేరే ఎక్కువగా ఉందని అని చెప్పారు. అది వింటే ఎంతో సంతోషంగా అనిపించిందని సోహెల్ ఎమోషనల్ అయ్యాడు.


Click it and Unblock the Notifications











