Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఏక్ మినీ కథ ఓటీటీ రిలీజ్.. ప్రభాస్ టీమ్ గట్టిగానే రాబట్టింది!
కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు సినిమా ఇండస్ట్రీలో గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమా వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. పెద్ద సినిమాలు సైతం ఓటీటీ డీల్స్ ముందు తలొగ్గక తప్పడం లేదు. ఇక చిన్న సినిమాలు కూడా ఆశలు వదిలేసుకొని ఓటీటీ డీల్స్ కు దాసోహం అవుతున్నాయి. ఇక ఆల్ మోస్ట్ రిలీజ్ కు సిద్దమైన సంతోష్ శోభన్ కొత్త సినిమా కూడా థియేట్రికల్ రిలీజ్ నుంచి తప్పుకుంది.
వర్షం దర్శకుడు శోభన్ కుమారుడైన సంతోష్ శోభన్ భవిష్యత్తును ఎలాగైనా సెట్ చేయాలని దర్శకుడు ప్రభాస్ ఎంతో జాగ్రత్తగా ఆలోచించి యూవీ క్రియేషన్స్ కు అతని బాధ్యతను అప్పగించాడు. ఇక యూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ లో వచ్చిన 'ఏక్ మినీ కథ' అనే సినిమా టీజర్ తోనే మంచి క్రియేట్ చేసింది. మెర్లపాక గాంధీ రాసిన ఈ సినిమా స్టోరీలో కథానాయకుడు పురుషాంగం చిన్నదిగా ఉండే ప్రాబ్లంతో బాధపడుతుంటాడు. టీజర్ తోనే ఆ విషయాన్ని బయటపెట్టి కాస్త బోల్డ్ గానే ప్రమోట్ చేశారు.
సినిమాను థియేట్రికల్ గా ఏప్రిల్ 30న రిలీజ్ చేయాలని గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ బాగానే చేసినప్పటికీ వర్కౌట్ కాలేదు. థియేటర్లు ఇప్పట్లో విడుదల అయ్యే ఛాన్స్ లేదని అమెజాన్ ప్రైమ్ ఇచ్చిన ఆఫర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సీనిమాను డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేసేందుకు 9కోట్లతో డీల్ సెట్ చేసుకున్నట్లు సమాచారం. ఒక విధంగా సినిమా బడ్జెట్ కంటే ఎక్కువ ఎమౌంట్ కావాదంతో ప్రొడక్షన్ సభ్యులు హ్యాపీగా అమెజాన్ లో రిలీజ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.