100 రోజులు సాలిడ్‌గా కొట్టిన ‘సోలో’
నారా రోహిత్, నిషా అగర్వాల్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో ఎస్వీకె సినిమా పతాకంపై వంశీ కృష్ణ శ్రీనివాస్ నిర్మించిన చిత్రం 'సోలో'. నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం రేపటితో(మార్చి 3) వంద రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ.... 'చిన్న సినిమాగా విడుదలైన మా సోలో కు ప్రేక్షకులు పెద్ద విజయాన్ని అందించారు. యువత సినిమా తర్వాత నాకు ఎంతో సంతృప్తినిచ్చిన చిత్రం 'సోలో'. నా కెరీర్లోనే రెండో శతదినోత్సవ చిత్రంగా నిలిచింది. మధ్యలో ఎన్ని పెద్ద సినిమాలు విడుదలైనా సోలోకు మాత్రం ఆదరణ తగ్గలేదు. ఓ మంచి కథకు, కుటుంబ విలువలు జోడిస్తే ఆ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే విషయాన్ని సోలో మరోసారి నిరూపించింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు మంచి సినిమా చూశామనే అనుభూతికి లోనవ్వడం, వారి మౌత్ పబ్లిసిటీతోనే సినిమాకు మరింత ఆదరణ పెరగడం ఎంతో ఆనందంగా ఉంది, ఈ చిత్రం ఇచ్చిన ప్రోత్సాహంతో మరిన్ని మంచి చిత్రాలు తెరకెక్కిస్తాను ' అన్నారు.
'సోలో' సినిమా ద్వారా మంచి విజయం సొంతం చేసుకున్న హీరో నారా రోహిత్ ఈ సినిమా తర్వాత మరో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే చిత్ర షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభం అయింది. శ్రీనివాస్ రాగ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సి.వి.రెడ్డి గులాబి మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 'ఒక్కడినే' అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. యాక్షన్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











