'సోలో' ప్రిమియర్ షో రిపోర్టు ఏంటి?
నారా రోహిత్ తాజా చిత్రం సోలో ప్రీమియర్ షో నిన్న రాత్రి వేయజం జరిగింది.ఎందరో సినీ ప్రముఖులు హాజరైన ఈ షోకు అంతా పాజిటివ్ రిపోర్టే వచ్చింది.ఇక సినిమా పూరీ జగన్నాధ్ వాయిస్ ఓవర్ తో మొదలవుతుంది.అతను బొబ్బిలి,అక్కడ ప్రకాష్ రాజ్ ప్యామిలీని పరిచయం చేస్తూండగా సినిమా ప్రారంభమవుతుంది.ప్రకాష్ రాజ్ తన ముద్దుల కూతురు వైష్ణవి(నిషా అగర్వాల్)పుట్టిన రోజుని జరుపుతూంటాడు.బంధువులతో పండగ వాతావరణం తో ఆ ఇల్లు ఆనందంగా మెరిసిపోతూంటుంది.వైష్ణవి గీతమ్స్ కాలేజీలో ఎమ్.బి.బిఎస్ చదువుతూంటుంది.ఇక గౌతమ్ (నారా రోహిత్)తన స్నేహితుడు శ్రీనివాస రెడ్డితో ఎంట్రీ.వైష్ణవిని చూసి ఎట్రాక్ట్ అవుతాడు.కొంత కామిడీ తర్వాత గౌతమ్ ప్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది.
అతను రావు రమేష్ పార్టీకి హాజరవుతాడు.అదో ఉమ్మడి కుటుంబం.అనాధ అయిన గౌతమ్ కి తాను అలాంటి కుటుంబంలో ఓ సబ్యుడుని అవ్వాలని ఉంటుందనే భావాన్ని వ్యక్తం చేస్తాడు.దాంతో అలాంటి అమ్మాయి కోసం వెతుకుతున్న గౌతమ్ కి వైష్ణవి కలవటం,నచ్చటం జరుగుతుంది.ఆమెను కన్వీన్స్ చేసి ప్రేమకు ఒప్పుస్తాడు.అందుకోసం ఫేక్ ఏక్సిడెంట్ లాంటివి సృష్టిస్తాడు.మరో ప్రక్క ఎమ్ ఎస్ నారాయణ ప్రొఫెసర్ గా తన కామెడీతో ఎంట్రీ ఇచ్చి గౌతమ్ ప్రేమకు సాయిం చేస్తాడు.అలా ప్రేమ కథ ఓ కొలిక్కి వచ్చాక తను ఆమె ప్రేమను పొందటానికి ఆడిన డ్రామా చెప్పి మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు.కానీ ఆమె నచ్చక వెళ్లి పోతుంది.
ఆ తర్వాత ధియోటర్ లో జరిగిన గొడవ వద్ద ఆమెను సేవ్ చేసి దగ్గర అవుతాడు.అలా పాటలుతో ప్రేమ సాగిపోతూండగా జయసుధ ఎంట్రీ.ఆమె ప్రకాష్ రాజ్ చెల్లెలు.ఆమెను తన కొడుకుకి తన మేనకోడలుని ఇచ్చి చేయమని అడుగుతుంది.అయితే అందుకు ప్రకాష్ రాజ్ ఒప్పుకోక తన కూతురుని ఓ ఉమ్మడి కుటుంబంలో ఇస్తానని క్లియర్ గా చెప్తాడు.ఆ తర్వాత వైష్ణవి ప్రేమ కథ తెలిసి అనాధ కి ఇవ్వనని చెప్పేస్తాడు.హీరో ఏం చేయాలో అర్దం కాని పరిస్దితుల్లో పడతాడు.ఈలోగా అలీ అనే ఓ బ్రోకర్ ఆమెకు ఓ సంభందం వస్తుంది.అది ఓ ఉమ్మడి కుటుంబం నుంచి.ప్రకాష్ రాజ్ వెంటనే ఓకే చేస్తాడు.లండన్ నుంచి వచ్చిన విశ్వనాధ్(షాయిజి షిండే)కొడుకుతో ఆమె పెళ్లి నిశ్చియం చేస్తారు.షాయీజి షిండే కి ఈ ప్రేమకథ తెలుసు అని అయినా తన కొడుకుకి ఇవ్వటానకి సమస్య లేదని అంటాడు. ఓ ప్రక్కన పెళ్లి పనులు.మరో ప్రక్క హీరో ఆమెను ఎలా దక్కించుకున్నాడనే కథతో క్లైమాక్స్ వస్తుంది.ప్రి క్లైమాక్స్ లో ఓ ట్విస్ట్ ఉంటుంది.


Click it and Unblock the Notifications











