సెన్సార్ కట్ అవుతుందని తెలిసినా సెక్స్ సీన్స్ షూట్ చేస్తున్నారు.దేనికి అంటే కథకి అదే కీలకమంటున్నారు.అలాగే ఈ విషయంలో బాలీవుడ్ దర్శకులు చాలా మంది కన్నింగ్ గా బిహేవ్ చేస్తున్నారు. సినిమాకి అవసరం లేక పోయినా సెక్స్ సీన్స్ తీస్తున్నారు.నేనూ అలానే మోసపోయాను అంటోంది ఇరవైనాలుగేళ్ళ స్లమ్ డాగ్ హీరోయిన్ Freida Pinto.పేరు చెప్పటానికి ఇష్టపడని బాలీవుడ్ స్టార్ డైరక్టర్ తనతో కొన్ని సెక్స్ సీన్స్ ప్లాన్ చేసాడని,మొదట అర్ధం కాక సహకరించినా తర్వాత కాదనటంతో నన్ను బయిటకు పంపించివేసాడని చెప్తోంది. అలాగే ఆ సన్నివేశాలు ఎలాగో సెన్సార్ గుమ్మం దాటవని వారికి తెలసని, అయినా వారి సరదా కోసమే అలా బిహేవ్ చేస్తూంటారని చెప్పుకొచ్చింది.'Complex' అనే మ్యాగ్ జైన్ కి స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమా రిలీజ్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వూలో ఈ విశేషాలన్ని చెప్పుకొచ్చింది. అలాగే నిజంగా ఆ కథ డిమాండ్ చేస్తే చేయటానికి తనకు అసలు ఇబ్బందే లేదని స్పష్టంగా చెప్పింది.
Story first published: Tuesday, December 9, 2008, 14:03 [IST]