»   » శ్రీదేవి కన్నా ముందు ఆ నలుగురు స్టార్స్ బాత్ టబ్‌లో..ఘోరంగా..!

శ్రీదేవి కన్నా ముందు ఆ నలుగురు స్టార్స్ బాత్ టబ్‌లో..ఘోరంగా..!

Subscribe to Filmibeat Telugu

శ్రీదేవి అకాల మరణం, ఆ తరువాత చోటు చేసుకుంటున్న పరిణామాలు దేశవ్యాప్తంగా అభిమానుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఆరోగ్యకరంగా జీవించిన శ్రీదేవి బాత్ టబ్ లో ఎలా మరణించింది అనే ప్రశ్న తొలిచి వేస్తోంది. గతంలో చాలా మంది సినీతారల మరణాలు మిస్టరీలుగా ఉన్నాయి. దశాబ్దాల కాలం తన అందం, అభినయంతో అభిమానులని అలరించిన శ్రీదేవి కథ ఇలా మిస్టరీగా, విషాదాంతంగా ముగియవలసిందేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాగా శ్రీదేవి తరహాలో కొందరు సెలెబ్రిటీలు బాత్ టబ్ లో మరణించిన వారు ఉన్నారు. వారి మరణాలకు కారణాలు తెలిసాయి. శ్రీదేవి మృతిలో మిస్టరీ కొనసాగుతోంది.

అందం, అభినయంతో ఉర్రూతలూగించిన తార

అందం, అభినయంతో ఉర్రూతలూగించిన తార

శ్రీదేవి తన అతిలోక సుందరి వంటి రూపం, మైమరపించే నటనతో యావత్ భారతాన్ని అలరించింది. అలాంటి శ్రీదేవి ప్రస్తుతం నిర్జీవంగా దుబాయ్ లో ఉండడం అభిమానులు జీర్ణించుకోలేని విషయం.

Sridevi Passes Away Twist : శ్రీదేవి చనిపోలేదు..ఇంకా శ్వాస ఆడుతున్నది ?
బాత్ టబ్‌లో మరణం మిస్టరీ

బాత్ టబ్‌లో మరణం మిస్టరీ

శ్రీదేవి హోటల్ గదిలోని బాత్ టబ్ లో మృతి చెందడం విషాదంతో కూడుకున్న మిస్టరీగా మారింది. శ్రీదేవి తరహాలో ఇండియాలో ఇలాంటి కేసులు నమోదు కాలేదు. కానీ గతంలో హాలీవుడ్ సెలెబ్రిటీలు కొందరు బాత్ టబ్ లో మృతి చెందిన సందర్భాలు ఉన్నాయి.

అతిపిన్న వయస్సులో హాలీవుడ్ నటుడు

అతిపిన్న వయస్సులో హాలీవుడ్ నటుడు

ప్రముఖ హాలీవుడ్ నటుడు జిమ్ మారిసన్(28) అతిపిన్న వయస్సులో బాత్ టబ్ లో మరణించాడు. 28 ఏళ్ల మారిసన్ పారిస్ లో బాత్ టబ్ లో మృతి చెందాడు. అతడి మృతికి కారణం అధికంగా డ్రగ్స్ తీసుకోవడం అని తేలింది.

అదే తరహాలో పాప్ సింగర్ విట్నీ

అదే తరహాలో పాప్ సింగర్ విట్నీ

జిమ్ మారిసన్ కు వలె అమెరికా పాప్ సింగర్ విట్నీ హూస్టన్ కూడా బాత్ టబ్ లో మరణించింది. 2012 లో ఈ ఘటన జరిగింది. విట్నీ హూస్టన్ కూడా 48 ఏళ్ల తక్కువ వయసులోనే మరణించారు. వీటిని డ్రగ్స్ మత్తులో బాత్ టబ్ లో పడిపోయినట్లు తెలుస్తోంది.

తల్లిలాగే కుమార్తె కూడా

తల్లిలాగే కుమార్తె కూడా

విట్నీ హూస్టన్ కుమార్తె బాబీక్రిస్టినా బ్రౌన్ కూడా బాత్ టబ్ లోనే మృతి చెందింది. 22 ఏళ్ల యుక్త వయసులో క్రిస్టినా బ్రౌన్ మృతి చెందింది. కృష్టా బ్రౌన్ మృతికి మద్యం మెడిసిన్స్ కారణం అని తెలుస్తోంది. బ్రౌన్ అమెరికన్ బుల్లితెరపై మెరిసింది.

అమెరికన్ గాయని గార్లాండ్ సూసైడ్

అమెరికన్ గాయని గార్లాండ్ సూసైడ్

అప్పట్లో పాప్ గాయనిగా ప్రసిద్ధి చెందిన జ్యుడి గార్లాండ్ తన నివాసంలోని బాత్ టబ్ లో ఆత్మహత్య చేసుకున్నారు. 47 ఏళ్ల వయస్సులో గార్లాండ్ మృతి చెందారు.

శ్రీదేవి శరీరంలో కూడా

శ్రీదేవి శరీరంలో కూడా

పైన పేర్కొన్న సెలెబ్రిటీలందరూ మద్యం, డ్రగ్స్ వంటివి సేవించి బాత్ టబ్ లో మృతి చెందారు. డ్రగ్స్, మద్యం మితిమీరడం వలన, ఆత్మహత్య చేసుకోవడం వలన ఆ ఘటనలు జరిగాయి. శ్రీదేవి రక్తంలో కూడా ఆల్కహాల్ ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదికలో తేలింది. కానీ శ్రీదేవి మరణం ప్రమాదమా లేక ఆత్మహత్య అనేది మిస్టరీ గానే మారింది.

English summary
Sridevi bathtub death became mystery. Some of celebrities who died like Sridevi in bathtub.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu