సాయి పల్లవి, రకుల్ మధ్య విభేదాలు.. రకుల్ అసహనం, రౌడీ బేబీ మౌనం! కారణమిదే..
Recommended Video
యంగ్ హీరోయిన్స్ సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ మధ్య విబేధాలు తలెత్తాయని తెలుస్తోంది. తమ తాజా సినిమా ఎన్జీకే విషయంలో సాయి పల్లవి, రకుల్ ప్రీత్ గొడవ పడ్డారని, అందుకే సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారనే టాక్ గుప్పుమంటోంది. ఇంతకీ వారిద్దరి మధ్య ఏం జరిగింది? సాయి పల్లవి, రకుల్ మధ్య విభేదాలంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత? ఆ వివరాలు చూస్తే..

సూర్య భార్యగా సాయి పల్లవి
సెల్వ రాఘవన్ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఎన్జీకే చిత్రంలో హీరో సూర్య సతీమణి పాత్రలో సాయి పల్లవి నటిస్తుండగా.. రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్ర పోషిస్తోంది.
నందగోపాల్ పాత్రలో హీరో సూర్య యంగ్ పొలిటికల్ లీడర్ గా దర్శనమీయనున్నారు. అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ చూస్తే సినిమాలోని పాత్రల పరంగానే సాయి పల్లవి, రకుల్ మధ్య విభేదాలు తలెత్తాయని తెలుస్తోంది.

తనకంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారని
ఎన్జీకే చిత్రంలో పాత్ర పరంగా సాయి పల్లవికి తనకంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారని, అదేవిధంగా సెట్స్ పై కూడా సాయి పల్లవికి ఇచ్చిన ఇంపార్టెన్స్ తనకు ఇవ్వకపోవడం బాధ కలిగిస్తోందని రకుల్ తన సన్నిహిత వర్గాలతో చెప్పుకుందట. ఆ నోటా ఈ నోటా పడి ఈ విషయం బయటకు రావడం, సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీయడం చక చకా జరిగిపోయాయి.

ప్రమోషన్ కార్యక్రమాల్లో చూసి
చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో చూసినా సాయి పల్లవి, రకుల్ ఏ మాత్రం కలివిడిగా ఉండకపోవడం చూసి సాయి పల్లవి, రకుల్ మధ్య విభేదాలు తలెత్తిన మాట వాస్తవమే అని ఫిక్సయ్యారంతా. అయితే ఈ విషయమై రకుల్ స్పందిస్తూ అలాంటిదేమీ లేదని కొట్టిపారేయగా.. సాయి పల్లవి మాత్రం సైలెంట్ గా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు చిత్రయూనిట్ కూడా ఇద్దరి పాత్రలు సమన పరిధిని కలిగి ఉంటాయని క్లారిటీ ఇవ్వడం ఇక్కడ ట్విస్ట్.

గతంలో సాయి పల్లవి ట్రాక్
గతంలో కూడా సాయి పల్లవి సినిమాల విషయంలో పలు రూమర్స్ బయటకు వచ్చాయి. ఆమె హీరోలకు కో ఆపేరేట్ గా ఉండరని, డామినేషన్ ఎక్కువని, షూటింగ్ స్పాట్ కి టైమ్ కి రాదని ఇలా రకరకాలుగా రౌడీ బేబీ గురించి చెప్పుకున్నారు. బట్ సినిమా రిజల్ట్స్ పరంగా సాయి పల్లవి భేష్ అనిపించుకుంది. మరి ఎన్జీకేకి సంబందించి ఈ వివాదం ఎలాంటి రిసల్ట్ తెస్తుందో చూడాలి.

ఎన్జీకే మూవీ
డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్త సమర్పణలో ఎన్‌జికె మూవీ తెరకెక్కింది. చిత్రానికి శ్రీరాఘవ దర్శకత్వం వహించగా.. సూర్య, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాత, శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. మే 31 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











