క్యాస్టింగ్ కౌచ్..ఒప్పుకుంటే కోట్లల్లో ఆఫర్స్.. ఆ హీరోయిన్స్ తలవంచక తప్పట్లేదు?
సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా లైంగిక వేధింపులు అనేవి అన్ని రంగాల్లో ఉన్నవే. కాకపోతే సినిమా ఇండస్ట్రీ అంటే స్పెషల్ కాబట్టి అందరు ఇక్కడే ఎక్కువగా ఫోకస్ చేస్తారు. ఈ మాట చాలా మంది హీరోయిన్స్ చెప్పారు. అయితే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే పడక పంచుకోవాల్సిందే అన్నవారు కూడా ఉన్నారు. నిజానికి ఇది చాలా మంది మంచి హీరోయిన్స్ ని కూడా బాధించే విషయం.

క్యాస్టింగ్ కౌచ్..
క్యాస్టింగ్ కౌచ్ అనేది ఈ కాలం నాటిది కాదు. హాలీవుడ్ నుంచి మాలీవుడ్ వరకు గత కొన్నేళ్లుగా కొనసాగుతున్నదే. దీన్ని అరికట్టేందుకు స్థానిక సినిమా పెద్దలు స్పెషల్ గా కమిటీ వేసినప్పటికి వివాదాలు తగ్గడం లేదు. మీటూ దెబ్బకు చాలా వరకు సినిమా ఇండస్ట్రీలలో చీకటి రహస్యాలు బయటపడ్డాయి. ఇక కొంత మంది నటిమణులు అయితే సీనియర్ నటుల చీకటి బాగోతాలను కూడా బయటపెట్టారు.

ఒప్పుకుంటే కోట్లల్లో ఆఫర్స్..
ఒక పెద్ద సినిమాలో నటించి స్టార్ హీరోయిన్ అవ్వాలని కొత్తగా అడుగులు వేసే ప్రతి హీరోయిన్ ఆశపడుతుంది. అయితే అలాంటి అవకాశాలు రావాలంటే కొంతమంది చెప్పినట్లు క్యాస్టింగ్ కౌచ్ ఊబిలో ఇరుక్కోవాల్సిందే అన్నట్లు టాక్ వస్తోంది. ఒప్పుకుంటే కోట్లలో ఆదాయాన్ని అందుకునే అవకాశాలు వస్తాయట. లేకుంటే వచ్చే చిన్న చిన్న అవకాశాలు కూడా మిస్ అవుతాయని కొంతమంది నటీమణులు మీటూ ఉద్యమంలో బయటపెట్టారు.

మీటూ దెబ్బకు..
మీటూ దెబ్బకు ఇప్పుడు కొంత మార్పులు వచ్చినట్లు తెలుస్తోంది. ఎవరో కొంత మంది చేసిన తప్పులకు మంచి నటీమణులు కూడా తలవంచుకునే పరిస్థితి సినిమా ఇండస్ట్రీలో ఏర్పడింది. దీంతో చాలా మంది హీరోయిన్స్ లైంగిక ఇబ్బందులు ఎదురవుతున్నా బయటకు చెప్పడం లేదు. ఇక మరికొందరైతే ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ తప్పు చేసే వారి గుండెల్లో భయాన్ని కలిగిస్తున్నారు.
Recommended Video

శ్రీ రెడ్డి ఎఫెక్ట్..
శ్రీ రెడ్డి వివాదం తరువాత టాలీవుడ్ పై నేషనల్ మీడియాలో సైతం ఊహించని విధంగా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అయితే ఆ దెబ్బకు చాలా వరకు తెలుగు హీరోయిన్స్ కి అవకాశాలు తగ్గాయి. కొత్తగా వచ్చే వారిని ఆఫీస్ గెట్ లోకి కూడా రానివ్వడం లేదు. ఎందుకంటే పొరపాటున అవకాశం ఇస్తామని చెప్పి చివరలో కుదరకపోతే శ్రీ రెడ్డి తరహాలో ఎవరైనా రచ్చ చేస్తారేమో అని భయపడి సైలెంట్ గా ఉంటున్నారట. రిస్క్ చేయకూడదని బయట ఇండస్ట్రీల నుంచే నటీమణులను సెలెక్ట్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











