టెలిఫోన్ ట్యాపింగ్ ఉచ్చులో మరికొంత మంది తెలుగు హీరోయిన్లు.. తారలకు వేధింపులు.. బ్లాక్ మెయిల్ అలా!
తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తులో భాగంగా తవ్విన కొద్ది షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. సంచలనం రేపుతున్న ఈ అవినీతీ భాగోతంలో ప్రముఖులు ఫోన్ కాల్స్ ట్యాపింగ్ విషయాలు దిగ్బ్రాంతికి గురి చేస్తున్నాయి. అయితే కేవలం రాజకీయ నేతలకే పరిమితం కాకుండా బిజినెస్, సాఫ్ట్‌వేర్, సినీ ప్రముఖులు ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టు వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ వివాదంలో వినిపిస్తున్న సినీ ప్రముఖుల వివరాల్లోకి వెళితే..
గత తెలంగాణ ప్రభుత్వంలో కీలక అధికారిగా పనిచేసిన ప్రణీత్ రావు చేసిన టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నది. ఓ ప్రైవేట్ ఛానెల్‌లో సర్వర్లు ఏర్పాటు చేసి.. ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశారు. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత సర్వర్లు, డేటా, స్టోరేజ్ డివైజేస్‌ను నాశనం చేశారనే ఆరోపణలపై ప్రణీత్ రావును అరెస్ట్ చేసి విచారించగా పలు వివాదాస్పద అంశాలు బయటకు వచ్చాయి.

టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సినీ హీరోయిన్లు, హీరోల ఫోన్ కాల్స్‌పై కూడా నిఘా పెట్టారు. వారి వ్యక్తిగత విషయాలను, ప్రొఫెషనల్ విషయాలను గుట్టు చప్పుడు కాకుండా విన్నారు. కొందరిని బ్లాక్ మెయిల్ చేసి భారీగా డబ్బులు లాగారు. చాలా మందిని వ్యక్తిగతంగా వేధించారు అనే విషయాలు మీడియాలో ప్రచారం అవుతున్నాయి.
ట్యాపింగ్ వ్యవహారంలో పలువురు హీరోలు, హీరోయిన్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఎవరిపై ఎందుకు నిఘా పెట్టారనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేకపోయింది. అయితే చాలా మంది హీరోయిన్ల ఫోన్ కాల్స్‌పై మాత్రం నిఘా పెట్టి వారి నుంచి చాలా వివరాలు సేకరించారు. వాటి ఆధారంతో వారిని బ్లాక్ బెయిల్ చేశారు అంటూ ప్రచారం జరుగుతున్నది.

ఇక ఈ వ్యవహారంలో ఓ స్టార్ హీరోయిన్ పేరు కూడా తెరపైకి రావడం మరో సంచలనంగా మారింది. ఈ ట్యాపింగ్‌తో ఆమె వైవాహిక జీవితం కూడా తారుమారైంది. ఓ ప్రముఖ హీరో, భర్త నుంచి విడాకులు కూడా తీసుకోవడానికి ఈ స్కామ్ ఓ కారణమనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అయితే అధికారికంగా పోలీసులు ఈ విషయాలను బయటపెడితే తప్ప.. ఎలాంటి క్లారిటీ ఉండదని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


Click it and Unblock the Notifications











