జాంబిలా ఉందని జోక్ చేసారు...హర్టైంది
హైదరాబాద్ : ఏ హీరోయిన్ ని అయినా నువ్వు ఇంత అందంగా ఉన్నావ్...అంత అందంగా ఉన్నావు అంటే మురిసిపోతారు. అదే జాంబిలా ఉన్నావంటే మాత్రం హర్ట్ అవుతారు. అలాంటి సంఘటనే శ్రుతి హాసన్ కి జరిగిందట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా చెప్తోంది. తనను చూసి జాంబిలా ఉన్నావంటూ చేసిన కామెంట్ ఆమె చెవిన పడిందిట. మాకూ ఇలాంటి ఇబ్బందులు ఉంటాయంటూ ఈమె ఈ విషయం గుర్తు చేసుకుంటూ చెప్తోంది.
శ్రుతి హాసన్ మాట్లాడుతూ... ''ఇటీవల ఓ సినిమా చిత్రీకరణ కోసం జ్యూరిచ్ వెళ్లాను. అప్పటికే వరుస చిత్రీకరణలతో విశ్రాంతి, నిద్ర లేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాను. ఎయిర్ పోర్టులో దిగి నడిచి వెళ్తుంటే నన్ను వింతగా చూశారు. ఎవరో అయితే 'జాంబీ (విచిత్రమైన మనిషి)లా ఉంది' అంటూ జోక్ చేశారు కూడా. ఆ తర్వాత నన్ను నేను అద్దంలో చూసుకుంటే నిద్ర లేక నా ముఖం వాడిపోయినట్లుంది. అప్పుడు తెలిసింది ఎందుకతను జోక్ వేశాడో'' అని చెప్పింది

మేము తెరపై అందంగా కనిపిస్తే మమ్మల్ని ఆరాధిస్తుంటారు. అదే ఏ మాత్రం ఆకర్షణ తగ్గినా ఇలా అయిపోయిందేంటి అనుకుంటారు. అదంతా మా మీద వారి అభిమానం. మేమెప్పుడూ అందంగా కనిపించాలనేదే వారి కోరిక. నటిగా కొనసాగాలంటే ఎన్నో ఇబ్బందులుంటాయంటోంది శ్రుతి హాసన్.
శ్రుతిహాసన్. సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం శ్రుతిహాసన్ తెలుగు, తమిళం, హిందీల్లో ఆరు సినిమాలతో బిజీగా ఉంది. హిందీ 'తేవర్'లో ఐటం సాంగ్ లో డాన్స్ చేసింది. ఆగడు చిత్రం రిజల్ట్ ఎలా ఉన్నా...శ్రుతి హాసన్ డాన్స్ కు మంచి పేరు వచ్చింది. కెరీర్ ప్రారంభంలో ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు గోల్డెన్ హ్యాండ్ గా మారింది.


Click it and Unblock the Notifications











