హీరో ఫైర్: సినిమా విడుదలవ్వకుండా కుట్ర చేస్తుందెవరు?
హైదరాబాద్: తమిళ స్టార్ హీరోల్లో ఒకరైన శింబు గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. తాజా శింబు చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయ్యాయి. తాను నటించిన ఓ సినిమా రిలీజ్ చాలాకాలంగా వాయిదా పడుతుండటంతో శింబు డిసప్పాయింట్మెంటుతో ఉన్నారు. తన ఫీలింగ్ష్ ట్విట్టర్ ద్వారాబయట పెట్టారు.
"కొందరు నా పట్ల జలసీగా ప్రవర్తిస్తున్నారు. వారిని నేను క్షమించినా.. వారి తప్పులకు ఎప్పటికైనా శిక్ష అనుభవిస్తారు. నేను ఎవరి గురించి ఈ ట్వీట్ చేశానో వారికి తెలుసు" అంటూ ట్విట్టర్‌లో ఆవేదన వ్యక్తం చేశాడు. అసలు శింబు కామెంట్స్ ఎవరిపై అనే దానిపై కోలీవుడ్‌లో జోరుగా చర్చ సాగుతోంది.

శింబు నటించిన "వాలు" మూవీ ఏడాదికి పైగా రిలీజ్ కాకుండా వాయిదా పడుతోంది. ఈ నెల 27న సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటన చేసినా.. మరోసారి మూవీ వాయిదా పడేటట్టే కనిపిస్తోంది. దీంతో తెగ డిప్రెస్ అయిన శింబు..ఈ సినిమా విడుదలకు కొందరు కావాలనే అడ్డుకుంటున్నారని ఆరోపించాడు.
విజయ్ చందర్ దర్శకత్వంలో ఎన్ఐసీ ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. హన్సిక హీరోయిన్. సంతానం, గణేష్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతు౦ది. ఈ సినిమా సెన్సార్ బోర్డు ‘యూ' క్లీన్ సర్టిఫికేట్ వచ్చినా కూడా పోస్ట్ పోన్ అవుతుంది. శింబు కెరీర్ లో 2012 లో హిట్ తరువాత ఇప్పటివరకు హిట్ లేదు. దీంతో తమిళ నాటు అతని స్టార్ స్టేటస్ దిగజారుతూ వస్తోంది. దీంతో ఈ సినిమాను విడుదల చేయడానికి తన శక్తి మేర ప్రయత్నిస్తున్నాడు. మరి సినిమా విడుదలవుతుందో? లేదో? చూడాలి.


Click it and Unblock the Notifications











