నాకంటూ ఒకడు ఉంటాడు: నయనతార

By Bojja Kumar

హైదరాబాద్: హీరోయిన్ నయన‌తార జీవితం అనేక మలుపులు తిరుగుతూనే ఉంది. హీరో శింబుతో లవ్వాయనం కొనసాగించి అతనితో ఫుల్లుగా ఎంజ్ చేసిన నయన శింబుతో ఇమడలేక విడిపోయింది. ఆ తర్వాత ప్రభుదేవాతో బంధం ఏర్పరచుకున్ననయనత అతన్ని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్దం అయింది. ఏమైందో తెలియదు కానీ అతనితో మనస్పర్థలు వచ్చి విడిపోయింది.

ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్న నయనతార పెళ్లి విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా పెళ్లి విషయానికొస్తే నాతో జీవితం పంచుకోవడానికి దేవుడు ఎవరో ఒకర్ని పెట్టించే ఉంటాడు. నాకంటూ ఒకడు తప్పకుండా ఉంటాడు. ప్రస్తుతానికైతే పెళ్లి ఆలోచన లేదు. అయితే ఎవరో ఒకరు నాకోసం వస్తారనే నమ్మకం మాత్రం ఉంది. దేవుడు నిర్ణయించినట్లు మన జీవితాలు సాగుతాయి' అని అంటోంది.

మహిళలు సాధారణంగా ఒక మగాన్ని బాగా ఇష్ట పడ్డారంటే వారి కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతారు. అదే సమయంలో తమకు ఇష్టమైన మగాళ్లపై ద్వేషం పెంచుకుంటే వాళ్లు నొచ్చుకునేలా..వాళ్లకు ఇష్టంకాని పనులు చేస్తుంటారు. ప్రస్తుతం నయనతార అదే పని చేస్తోంది.

ప్రభుదేవా కోసం క్రైస్తవ మతం నుంచి హిందూ మతంలోకి మారడమే కాదు... సినిమాలకు కూడా పూర్తిగా దూరం కావాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు శ్రీరామరాజ్యం సినిమా తర్వాత నయనతార ఏ సినిమాలు కూడా ఒప్పుకోలేదు. ఏమైందో తెలియదు కానీ ఉన్నట్టుండి వీరి మధ్య విబేధాలు వచ్చాయి. ప్రేమ పెటాకులైంది.

దీంతో ప్రభుదేవాపై రివేంజ్ తీర్చుకోవడమే పనిగా పెట్టుకున్న నయన.... ప్రభుదేవాకు ఇష్టం కాని పనులు చేయడం మొదలు పెట్టింది. అందులో భాగంగానే ఎడాపెడా సినిమాలకు సంతకాలు చేసేస్తోంది నయన. అంతేకాదు బాలీవుడ్లో ఐటం సాంగు కూడా చేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. తొలుత చేయడానికి కాస్త ఆలో చించినా...కోటి రూపాయలు రెమ్యూనరేషన్ ఇస్తామనడంతో ఓకే చెప్పిందట. ఆ సినిమాకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం బాలీవుడ్లో ప్రభుదేవా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన దర్శకత్వం వహించిన 'రౌడీ రాథోడ్' చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. ఈనేపథ్యంలో ఐటం సాంగు చేయడం ద్వారా ప్రభుదేవాను నొప్పించడంతో పాటు తమ మ్యాటర్ బాలీవుడ్ జనాల దృష్టిలో పడేయటం ద్వారా అతను ఇబ్బంది పడటమే లక్ష్యంగా పెట్టుకుందట నయనతార.

ప్రస్తుతం నయనతార పలు తెలుగు, తమిళం ప్రాజెక్టులో బిజీగా గడుపుతోంది. నాగార్జున, దశరత్ కాంబినేషన్లో రూపొందుతున్న 'లవ్ స్టోరీ' చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఇవే కాకుండా రాణా హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న 'కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రంలో నటిస్తోంది. గోపీచంద్, నయనతార కాంబినేషన్ లో భూపతి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మరో వైపు 'భూలోగం' అనే తమిళ చిత్రానికి సంబంధించి ఇటీవలే దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X