twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సిద్ధార్థ ‘సంథింగ్ సంథింగ్’రిలీజ్ డేట్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : సిద్ధార్థ-హన్సిక జంటగా లక్ష్మీ గణపతి ఫిలింస్ బ్యానర్ పై సుందర్.సి దర్శకత్వంలో సుబ్రహ్మణ్యం.బి, సురేష్.ఎస్, నిర్మిస్తున్న లవ్ అండ్ కామెడీ ఎంటర్టెనర్ 'సంథింగ్ సంథింగ్'. ఈ చిత్రం జూన్ 14న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ... ఆడియోకు మంచి స్పందన వస్తోందని, సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు.

    వాస్తవానికి ఈ చిత్రాన్ని తమిళంలో కుష్భూ నిర్మించగా, లక్ష్మీగణపతి ఫిలింస్ వారు చిత్ర తెలుగు హక్కులు కొనుగోలు చేసారు. తమిళ వెర్షన్లో సంతానం కామెడీ పండిస్తాడు. తెలుగులో ఆ పాత్రను బ్రహ్మానందంతో చేయించారు. అయితే ఈచిత్రాన్ని తెలుగులోనే నిర్మించినట్లుగా మొదటి నుండీ చెబుతూ వస్తున్నారు దర్శక నిర్మాతలు.

    ఇటీవల నిర్మాతలు మీడియాతో మాట్లాడుతూ...నాన్‌స్టాప్ ఎంటర్టెన్మెంట్‌తో ప్రేక్షకులను వినోదంలో ముంచెత్తే చిత్రమిది. తెలుగులో డైరెక్షన్ చేస్తున్న చిత్రమిది. చిత్రానికి బ్రహ్మానందం పాత్ర హైలెట్‌గా ఉంటుంది. సుందర్. సి తొలిసారిగా తెలుగులో డైరెక్ట్ చేస్తున్న చిత్రమిది. తమిళంలో ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన ఆయన ఈచిత్రం ద్వారా తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చే చిత్రమవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. త్వరలో సెన్సార్ పూర్తవుతుంది. జూన్ 14న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

    దర్శకుడు సుందర్ సి మాట్లాడుతూ..'తెలుగులో చేస్తున్న నా తొలి ప్రయత్నంలోనే మంచి నిర్మాతలతో, మంచి ఆర్టిస్టులతో, టెక్నీషియన్స్‌తో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా తొలి చిత్రమే హిట్టకొట్టడం ఖాయమే. బ్రహ్మానందంతో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. పాటలు కూడా మంచి పాపులర్ అయ్యాయి. సినిమా కూడా అందరికీ నచ్చుతుంది' అన్నారు.

    సిద్ధార్థ, హన్సిక, సుధ, బ్రహ్మానందం, వేణుమాధవ్, గౌతంరాజు, గణేష్ వెంకట్ రామన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రపీ : గోపీ అమర్ నాథ్, సంగీతం : సత్య, ఎడిటర్ : ప్రవీణ్ కె.ఎల్, శ్రీకాంత్ ఎన్.బి, ఆర్ట్ : గురురాజ్, కొరియోగ్రఫీ : బింద్ర, సోబి, రచన : వెలిగొండ శ్రీనివాస్, పాటలు : వనమాలి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సుందర్.సి, నిర్మాతలు : సుబ్రహ్మణ్యం.

    English summary
    
 Siddharth, Hansika starrer Something…Something is now gearing up for release on June 14. Sundar C has directed the film and Khushboo has produced it. Lakshmi Ganapathi Films has bought the rights for the Telugu version.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X