‘సంథింగ్ సంథింగ్’ ఆడియో ఆవిష్కరణ, జనాన్ని రెచ్చగొడతానన్న దాసరి!
హైదరాబాద్: ఓ మై ఫ్రెండ్ చిత్రంలో జోడీగా నించిన సిద్ధార్థ-హన్సిక 'సంథింగ్ సంథింగ్' చిత్రంలో మరోసారి జతకట్టారు. కుష్బూ నిర్మిస్తున్న ఈచిత్రానికి ఆమె భర్త సుందర్.సి దర్శకత్వం వహిస్తున్నారు. ఈచిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో గ్రాండ్ గా జరిగింది. దర్శకరత్న దాసరి నారాయణరావు చేతుల మీదుగా ఆడియో ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి రాణా, కుష్బూ, సుందర్. సి, సిద్ధార్థ, శ్రీహరి, హన్సిక, గణేష్ వెంకట్రామన్, విశాల్, సంజన తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా దాసరి నారాయణ మాట్లాడుతూ....హన్సిక కోసం సిద్ధార్థ వెంటపడే సినిమా అని అర్థమైంది. ఈ సినిమాకు తెలుగు టైటిల్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగు సినిమాలకు తెలుగు టైటిళ్లు పెట్టకపోతే జనం ఒప్పుకోరు. ఒక వేళ వారు ఒప్పుకున్నా నేను వారిని రెచ్చగొడతా. సుందర్. సి చాలా మంచి సినిమాలు తీసారు. తెలుగు పరిశ్రమలోకి ఆయన్ను ఆహ్వానిస్తున్నా అని వ్యాఖ్యానించారు.
తెలుగునాట లక్ష్మి గణపతి ఫిలింస్ వారు ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు దక్కించుకున్నారు. సిద్ధార్థ ఇటీవల నటించిన పలు చిత్రాలు ఒకే సారి తెలుగు, తమిళంలో రూపొందడం చూస్తునే ఉన్నాం. ఇరు ప్రాంతాల్లో సిద్ధార్థ సినిమాలకు మంచి ఆదరణ ఉండటంతో ఈ చిత్రాన్ని కూడా తెలుగు తమిళంలో ఒకేసారి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
'సంథింగ్ సంథింగ్' చిత్రం తమిళంలో 'తీయ వేలయ్ సెయ్యనుమ్ కొమరు' అనే పేరుతో రూపొందుతోంది. అయితే తెలుగు తమిళంలో కొన్ని పాత్రలను మార్పు చేసారు. తమిళ వెర్షన్లో సంతానం కామెడీ పండిస్తాడు. తెలుగులో ఆ పాత్రను బ్రహ్మానందంతో చేయించారు. సాఫ్ట్ వేర్ కంపెనీ బ్యాక్ డ్రాప్‌తో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో సిద్ధార్థ, హన్సిక సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా కనిపించనున్నారు.

ఆడియో ఆవిష్కరిస్తున్న దాసరి

ఆడియో వేడుకలో సంజన, నవదీప్, రానా

హన్సిక, ఖుష్బూ ముచ్చట్లు

ఖుష్భూ వేసిన జోక్ విని అంతా నవ్వుకున్నారిలా...

సిద్ధార్థ, హన్సిక, ఖుష్భూ

ఆడియో ఆవిష్కరణ దృశ్యం

సీడీలను పంచుతున్న దాసరి

సంథింగ్ సంథింగ్ ఆడియో వేడుక

సంజన

సిద్ధార్థ

రానా, సంజన

సంథింగ్ సంథింగ్ ఆడియో వేడుక

సంథింగ్ సంథింగ్ ఆడియో వేడుక

సంథింగ్ సంథింగ్ ఆడియో వేడుక

సంథింగ్ సంథింగ్ ఆడియో వేడుక

సంథింగ్ సంథింగ్ ఆడియో వేడుక

సంథింగ్ సంథింగ్ ఆడియో వేడుక

సంథింగ్ సంథింగ్ ఆడియో వేడుక

సంథింగ్ సంథింగ్ ఆడియో వేడుక


Click it and Unblock the Notifications











