రాజశేఖర్ ఇష్యూ పై త్రిష స్పందన

కానీ ఇప్పుడు ఆ విషయంపై మాట్లాడాలంటే రెండు వైపులనుంచి ఏం జరిగిందో తెలుసుకునే చెయ్యగలం అంది.అలాగే కొత్తగా పరిశ్రమలోకి వచ్చే వారికి జాగ్రత్తగా తను పనిచేసే వ్యక్తులను ఎంపిక చేసుకోవాలంటూ సూచించింది. అంతేగాక ఈ వృత్తిలో డెడ్ లైన్స్ అనేవి ఉంటాయి..ప్రతీ ఒక్కరూ వాటిని పాటించాల్సిందే. బ్యాడ్ వెదర్ లో కూడా బ్రేక్ లేకుండా పనిచేయాల్సి వస్తుంది. మనం ఒక్కరమే తప్పించుకోవటానికి ఉండదు..ఎందుకంటే మొత్తం యూనిట్ అంతా కష్టపడి పని చేస్తుంటే తప్పదు అంటోంది.
ఇదే విషయంపై ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు స్పందిస్తూ..ఇక్కడ టాలీవుడ్ లో మూవి ఆర్టిస్ట్స్ అశోశియోషన్,ప్రొడ్యూసర్స్ కౌన్సిల్,ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉన్నాయి. ఆర్టిస్టులు ఏమన్నా సమస్యలు వస్తే వీటిల్లో దేన్నైనా సంప్రదించి న్యాయం కోరాలి. అప్పుడు ఆ ఆరోపణ నిజమని తేలితే తప్పనిసరిగా మేం యాక్షన్ తీసుకుంటాం.అయితే చాలా మంది అలా చేయటం లేదు. మా దగ్గరకి రావటం లేదు. ఇక ఇప్పడు నీతూ చంద్ర మా దగ్గరికి ప్రూప్ లతో ఆ ఇష్యూ తీసుకువస్తే తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటామన్నారు.
ఇక అదే సినిమాలో ఓ చిన్న పాత్రలో నటిస్తున్న మిలింద్ సోమన్ మాట్లాడుతూ నేను తప్పని సరిగా ఆమె తరుపున నిలబడతాను. అయితే రెండు వైపులా క్లారిఫై చేసుకోవాలి. అలాగే రాజశేఖర్ నన్ను బాగా ట్రీట్ చేస్తున్నారు. అందరినీ అట్లానే బాగానే చూస్తున్నారని నా అభిప్రాయం. అయితే అంత రెస్పిక్ట్ ఇవ్వటానికి కారణం నేను పరిశ్రమకు కొత్త కాకపోవటమేనేమో అన్నారు. ఏది ఎలా ఉన్నా అందరూ ఇంట్రస్టుతో పనిచేస్తేనే మంచి ప్రాజెక్టు వస్తుందంటూ ముగించారు.


Click it and Unblock the Notifications











