‘YS Jagan సినీ పరిశ్రమను నాశనం చేయకండి.. చిరంజీవి చేతులెత్తి మొక్కినా మనసు కరగలేదా?‘

వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఏపీకి ముఖ్యమంత్రి అయ్యాడనే సంతోషం పోయింది. రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్రంలో పెట్టుబడులు, రాష్ట్రంలో వ్యవసాయ రంగం, నీటి పారుదల రంగం లాంటి విషయాలపై ఏపీ సీఎం దృష్టిపెట్టాలి. కానీ అలా కాకుండా రాష్ట్ర ప్రయోజనాలు వదిలేసి.. పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాను ఎలా అడ్డుకోవాలి? టికెట్ల రేట్లు ఎలా కట్ చేయాలి అని ఆలోచించడం సరికాదు అని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

సినీ పరిశ్రమ మంచి కోసం టికెట్ రేట్లు పెంచుతామని ఇచ్చిన హామీ అమలు చేయకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం తప్పు. భీమ్లా నాయక్ సినిమా టికెట్ రేట్లు పెంచకుండా.. ఆ సినిమా రిలీజ్ తర్వాత నిర్మాతకు నష్టం వచ్చిన తర్వాత పెంచితే ప్రయోజనం ఏముంటుంది? పవన్ కల్యాణ్ సినిమా కాబట్టి కక్ష సాధిస్తారా? ఆయన హీరో కాకుండా హీరోయిన్‌ను చేయగలరా? పవన్ కల్యాణ్ ఎవర్ గ్రీన్ హీరో.. ఆయనను ఏమీ చేయలేరు అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.

Somi Reddy Chandra mohan Reddy, CPI Narayana blast YS Jagan over Bheemla Nayak ticket rates Issue

భారతదేశంలో సినిమా పరిశ్రమ జోలికి వచ్చిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. తెలుగు సినిమా ప్యాన్ ఇండియా స్థాయికి చేరిందని సాక్షాత్తూ ప్రధాన మంత్రి మోదీ చెప్పారు. అయితే జగన్ మాత్రం మరో పక్క సినిమాను తొక్కేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి చేతులెత్తి వేడుకొని, ప్రాధేయ పడినా నీ మనసు కరగలేదంటే.. ఏమనుకోవాలి. ఇప్పటికైనా కక్ష సాధింపు చర్యలు ఆపేయండి. సినిమా పరిశ్రమను నాశనం చేయకండి. విశాల హృదయంతో ఆలోచించి సినీ పరిశ్రమకు సహకారం అందించాలి అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.

ఏపీలో టికెట్ల రేట్ల వివాదంపై సీపీఐ నేత నారాయణ మాట్లాడుతూ.. టికెట్ రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచుకోకుండా ఏపీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం కరెక్ట్. కానీ సీఎం వైఎస్ జగన్ చేసిన తప్పు ఏమిటంటే.. సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులందరిని పిలిచి చర్చలు జరపకుండా.. తనకు నచ్చిన, రాజకీయ దురద్దేశంతో కొంతమందినే పిలిచి మాట్లాడటం తప్పు. ముఖ్యమంత్రి ఒంటెద్దు పోకడ వల్లే ఇలాంటి సమస్య తలెత్తింది అని నారాయణ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X