బాహుబలి రికార్డుల్లోనే కాదు.. విరాళాల్లో కూడా.. ప్రభాస్ సహాయానికి పొలిటికల్ టచ్!

కరోనావైరస్ కారణంగా అమలవుతున్న లాక్‌డౌన్ సమయంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్నారు. ప్రధాని మోదీ సూచనలు, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఆయన సోషల్ డిస్టెన్స్‌ను పాటిస్తున్నారు. అంతేకాకుండా కరోనా కారంణంగా సినీ పరిశ్రమ స్తంభించడంతో ఇబ్బందులకు గురవుతున్న రోజు వారీ వేతన కార్మికులను ఆదుకొనేందుకు భారీ విరాళాన్ని ప్రకటించారు. అయితే తన విరాళాలపై రాజకీయ పార్టీ స్పందించడం చర్చనీయాంశమైంది. ఇక వివరాల్లోకి వెళితే..

ప్రభాస్ ప్రకటించిన విరాళం

ప్రభాస్ ప్రకటించిన విరాళం

కరోనావైరస్ కారణంగా ఇబ్బందికి గురవుతున్న ప్రజలకు ఆదుకోవడానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు చెరో రూ.50 లక్షలు సహాయం ప్రకటించారు. అలాగే ప్రధాని మోదీ పిలుపుకు స్పందించిన ప్రభాస్ మరో 3 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు. దాంతో సినీ, రాజకీయ వర్గాల నుంచి ప్రశంసలు మొదలయ్యాయి.

 టీడీపీ నేత ట్వీట్

టీడీపీ నేత ట్వీట్

కరోనా వైరస్ పై వ్యాప్తి చెందుకుండా చేస్తున్న కేంద్ర, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు టాలీవుడ్ హీరో ప్రభాస్ భారీ విరాళం ప్రకటించడంపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందిస్తూ ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించారు. ‘బాహుబలి' చిత్ర రికార్డుల్లోనే కాదు, ‘కరోనా' విరాళాల్లోనూ తెలుగు సినీ రంగంలో ప్రభాస్ ముందుండటం అభినందనీయమని సోమిరెడ్డి కొనియాడారు.

చిన్న వయసులోనే గొప్ప మనసు

చిన్నవయస్సులోనే పెద్ద మనస్సు చాటుకుంటూ ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ.3 కోట్లు, ఏపీ, తెలంగాణల సీఎంల సహాయనిధికి కలిపి కోటి రూపాయలు ఇవ్వడం చాలా గొప్ప విషయమని ప్రశంసిస్తూ టీడీపీ నేత సోమిరెడ్డి ఓ ట్వీట్ చేశారు. ఇలా ప్రత్యేకంగా ప్రభాస్ గురించి ప్రశంసలు గుప్పించడం వెనుక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

Recommended Video

Prabhas In Trouble, Prabhas20 Film Shooting Held in Georgia
ప్యాన్ వరల్డ్ మూవీలో

ప్యాన్ వరల్డ్ మూవీలో

ఇక కెరీర్ విషయానికి వస్తే.. దర్శకుడు రాధాకృష్ణతో ప్రభాస్ తన 20వ సినిమాను రిలీజ్‌కు సిద్ధం చేస్తున్నారు. అలాగే మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్యాన్ వరల్డ్ మూవీని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ గానీ, కత్రినా కైఫ్ గానీ ప్రభాస్ సరసన నటించే అవకాశాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X