Somy Ali: సల్మాన్ ఖాన్‌పై మాజీ ప్రేయసి సంచలన వ్యాఖ్యలు.. ఒక శాడిస్ట్ అంటూ పోస్ట్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు పరిచయం అక్కర్లేదు. 50 ఏళ్ల వయసు దాటిన స్టిల్ మోస్ట్ బ్యాచిలర్‌గా మిగిలిపోయాడు సల్లూ భాయ్. ఇప్పటిదాగా పెళ్లి అనే టాపిక్ లేకుండా జీవితాన్ని గడిపాడు సల్మాన్ ఖాన్. అయితే ఈ కండల వీరుడు నడిపిన ప్రేమాయణం చిట్టా తీస్తే చాలా పెద్దదిగానే ఉంటుందని టాక్. ఎంతో మంది హీరోయిన్లతో సల్లూ భాయ్ లవ్ అఫైర్ కొనసాగించాడని ఎన్నో కథనాలు వచ్చాయి. అయితే తాజాగా ఆయన మాజీ ప్రేయసిలో ఒకరైన సోమి అలీ సల్లూ భాయ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

సల్మాన్ ఖాతాలో ఎంతోమంది
బాలీవుడ్ కండల వీరుడు, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌గా సల్మాన్ ఖాన్ ఎంతోమంది హీరోయిన్స్, మోడల్స్‌తో ప్రేమయాణం జరిపాడు. వారిలో ఐశ్వర్య రాయ్, కత్రీనా కైఫ్ వంటి స్టార్ హీరోయిన్స్ కూడా ఉన్నారు. అంతేకాకుండా అతని ప్రేమ జాబితాలో పాకిస్తాన్ బ్యూటి సోమి అలీ కూడా ఉంది.

సల్మాన్‌ను తిడుతూ ఇన్‌స్టా పోస్ట్
తాజాగా ఈ బ్యూటీ సల్మాన్ ఖాన్‌పై విరుచుకుపడింది. సల్మాన్ తనతో సహా ఇతర మహిళలను కొట్టేవాడని ఘాటు వ్యాఖ్యలు చేసింది. సల్మాన్ ఖాన్‌ను తిడుతూ తన ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. 'మైనే ప్యార్ కియా' సినిమా పోస్టర్ షేర్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది సోమి అలీ.

సల్మాన్ ఓ శాడిస్ట్..
సల్మాన్ ఖాన్ ఒక ఉమెన్ బీటర్ (మహిళలను కొట్టే వ్యక్తి) అంటూ ప్రస్తావించింది. ''సల్మాన్ ఖాన్‌ను గొప్పగా కీర్తించడం మానేయండి. అతను ఒక శాడిస్ట్. ఎంతటి శాడిస్టో మీకు తెలియదు. అతను తరచూ అమ్మాయిలను కొడుతుంటాడు. నాతో సహా ఎంతో మంది అమ్మాయిలపై అతను చేయి చేయిచేసుకున్నాడు'' అని రాసుకొచ్చింది.

ఐశ్వర్యా రాయ్‌ను కొట్టిన సల్మాన్..
ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట హల్చల్ చేస్తూ చర్చనీయాంశమైంది. అయితే గతంలో ఓ పార్టీలో మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్‌ను సల్మాన్ ఖాన్ కొట్టినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా పాకిస్తాన్లో పుట్టి పెరిగిన సోమి అలీ ప్రస్తుతం అమెరికాలో స్థిరపడింది.

మైనే ప్యార్ కియాలో చూసి..
మైనే ప్యార్ కియా సినిమా చూసి సల్మాన్ ఖాన్‌ను ఇష్టపడిన సోమి అలీ అతని కోసం ఇండియా వచ్చింది. ముంబైలో దిగిన సోమి.. మోడల్‌గా కెరీర్లో బిజీగా ఉంది. ఏదో షూటింగ్ సమయంలో కలిసిన సోమి, సల్మాన్ ఖాన్ ప్రేమలో పడి పదేళ్లు డేటింగ్ చేసింది.

మానవ అక్రమ రవాణా బాధితుల్ని కాపాడుతూ..
తర్వాత తలెత్తిన మనస్పర్థల కారణంగా సల్మాన్ ఖాన్‌కు బ్రేకప్‌తోపాటు సినిమాలకు గుడ్ బై చెప్పింది. అనంతరం తిరిగి అమెరికా వెళ్లి పోయిన సోమి అలీ సింగిల్‌గా ఉంటూ నో మోర్ టియర్స్ అనే స్వచ్ఛంద సంస్థ నడుపుతూ మానవ అక్రమ రవాణా బాధితుల్ని కాపాడుతోంది.

కత్రీనాతో టైగర్ 3..
ఇక అప్పుడప్పుడూ సల్మాన్ ఖాన్‌ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పిస్తుంది. ఇంతకుముందు కూడా ఇలానే సల్మాన్ ఖాన్‌పై విరుచుకు పడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇక సల్మాన్ ఖాన్ విషయానికొస్తే, అతను ప్రస్తుతం కత్రీనా కైఫ్‌తో కలిసి టైగర్ 3 చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. అలాగే చిరంజీవి గాడ్ ఫాదర్లో గెస్ట్ రోల్ చేయనున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











