తమ అభిమాన నటుడు చిరుకి ఓటు వెయ్యలేదనే తండ్రిని చంపిన తనయుడు ఉదంతం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశాఖ జిల్లాకి చెందిన అచ్చంపేట గ్రామ కాపురస్తుడు కోసూరు బుల్లబ్బాయి(55) కుమారుడు కోసూరు రాజబాబు(23). చిరంజీవి అన్నా ఆయన స్ధాపించిన ప్రజారాజ్యం అన్నా విపరీతమైన అభిమానం కల రాజబాబు తొలివిడత పోలింగ్ అప్పుడు తన తండ్రితో గొడవపడ్డాడు. తండ్రి ఎన్టీఆర్ కి వీరాభిమాని. దాంతో అతను తెలుగు దేశానికి వేస్తాననంటతో ప్రజారాజ్యానికే ఓటేయమని బెదిరించి ఒప్పించాడు. అయితే పోలీంగ్ బూత్ కి వెళ్ళి ఓటేసి వచ్చిన ఆ తండ్రి..తాను టీడీపికి ఓటేశానని చెప్పటంతో మళ్ళీ తీవ్ర స్ధాయిలో గొడవైంది. ఆ ఉద్రేకంలో తండ్రిని చంపేసాడు. తర్వాత ఏం చేయాలో అర్దం కాని స్ధితిలో సహజ మరణంగా అందరితో నమ్మించి దహన కార్యక్రమాలు చేసాడు. అయితే అసలు విషయం కనిపెట్టిన కొందరు గ్రామస్తులు పోలీసులుకు పిర్యాదు చేసారు. మొదట కాదని బుకాయించినా తర్వత విచారణలో పోలీసులుకు నిజం చెప్పాడు రాజబాబు. ఈ విషయంపై పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు.